https://oktelugu.com/

‘మీలో ఎవరు కోటీశ్వరుడి’గా ఎన్టీఆర్.. త్రివిక్రమ్ డిజైన్

‘బిగ్ బాస్’తో హోస్ట్ గా అలరించిన ఎన్టీఆర్ ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ మూవీ వల్ల రెండేళ్ల పాటు లాక్ అయ్యారు. అందుకోసం బిగ్ బాస్ నుంచి కూడా వైదొలిగారు. అయితే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్ ’ పూర్తయ్యింది. అందుకే మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఈసారి స్టార్ మా నిర్వహించే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్ట్ గా రావడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పారు. ఈ కార్యక్రమం మే నుంచి టెలికాస్ట్ కాబోతోంది. ఈ […]

Written By: , Updated On : February 24, 2021 / 09:19 PM IST
Follow us on

Trivikram NTR

‘బిగ్ బాస్’తో హోస్ట్ గా అలరించిన ఎన్టీఆర్ ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ మూవీ వల్ల రెండేళ్ల పాటు లాక్ అయ్యారు. అందుకోసం బిగ్ బాస్ నుంచి కూడా వైదొలిగారు. అయితే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్ ’ పూర్తయ్యింది. అందుకే మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యారు.

ఈసారి స్టార్ మా నిర్వహించే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్ట్ గా రావడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పారు. ఈ కార్యక్రమం మే నుంచి టెలికాస్ట్ కాబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రమోషన్ కోసం తాజాగా యాడ్స్ రూపొందించారు.

తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. స్టార్ మా ఇచ్చిన ఐడియాను కాన్సెప్ట్ గా మార్చి తన స్టయిల్ లో త్రివిక్రమ్ ఈ యాడ్ తీసినట్టు సమాచారం.

అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ షూటింగ్ లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గెటప్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారని సమాచారం. ఈ యాడ్ ను మార్చి చివరలో విడుదల చేస్తారని తెలిసింది. ఇప్పటివరకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ను ఎన్టీఆర్ చేస్తాడని అధికారికంగా ప్రకటించలేదు. ఈ యడ్ తోనే స్టార్ మా క్లారిటీ ఇవ్వనుంది.