https://oktelugu.com/

వైసీపీ మాదిరిగానే షర్మిల పార్టీ జెండా.. జగన్ ఒప్పుకుంటాడా? ప్రజలకు కన్ఫ్యూజ్ నే?

వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టబోయే రాజకీయ పార్టీపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ సాగుతోంది.. గత కొద్ది రోజులుగా ఆమె పార్టీపై సస్పెన్స్ కొనసాగుతుండగా మొత్తానికి ఆమె పార్టీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీ జెండా రంగులను కూడా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ ఇక రంగంలోకి దిగినట్లేనని అనుకుంటున్నారు..  ఆమె పార్టీ కోసం జెండాను ఎలా ఎంపిక చేశారన్న చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2021 2:12 pm
    Follow us on

    jagan-sharmila

    వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టబోయే రాజకీయ పార్టీపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ సాగుతోంది.. గత కొద్ది రోజులుగా ఆమె పార్టీపై సస్పెన్స్ కొనసాగుతుండగా మొత్తానికి ఆమె పార్టీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీ జెండా రంగులను కూడా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ ఇక రంగంలోకి దిగినట్లేనని అనుకుంటున్నారు..  ఆమె పార్టీ కోసం జెండాను ఎలా ఎంపిక చేశారన్న చర్చ సాగుతోంది.

    ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ జెండా మాదిరిగానే తెలంగాణలోని షర్మిల పార్టీ ప్లాగ్ ఉంటుందని అంటున్నారు. లేత ఆకుపచ్చ, నీలి రంగుతో జెండాను రూపొందించినట్లు తెలుస్తోంది. జెండా మధ్యలో తెలంగాణ చిత్రపటం, అందులో వైఎస్సార్ ఫొటో ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ పార్టీ కోసం ఓ కార్యాలయాన్ని కూడా నిర్మించనున్నారట. హైదరాబాద్ శివారులోని మెట్రో రైలు రూట్ కు దగ్గరగా 2 ఎరాల్లో ఈ ఆఫీసు ఉండనుందని షర్మిల అనుచరులు అనుకుంటున్నారు.

    ఇదిలా ఉండగా షర్మిల పార్టీ జెండా గురించి తెలుసుకున్న ఏపీ సీఎం జగన్ షాక్ తిన్నారని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీల జెండాలు ఒకే మాదిరిగా ఉంటే ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని జగన్ భావించారని తెలుస్తోంది. అయితే వైఎస్ అభిమానులను మాత్రమే నమ్మొకని రంగంలోకి దిగుతున్న షర్మిల ఆయన ఫొటో ఆధారంగానే జనాల్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

    అయితే జగన్ ఈ విషయంలో ముందుగా షాక్ గురైనా ఆ తరువాత పార్టీ జెండాలో కొన్ని మార్పులు చేస్తే బాగుండునని తన సన్నిహితుల ద్వారా అన్నారని సమాచారం. షర్మిల పార్టీతో భవిష్యత్తులో తెలంగాణలో ఇక వైఎస్సార్ సీపీతో వెళ్లలేమని చర్చించినట్లు తెలుస్తోంది. రెండు జెండాలు ఒకే పోలికతో ఉంటే ప్రజలు అయోమయానికి గురై ఏ పార్టీని ఆదరించాలో తెలియక ఇరు పార్టీలు నష్టపోయే ప్రమాదం ఉందని జగన్ అన్నట్టు తెలుస్తోంది. కాగా త్వరలో షర్మిల పార్టీ గురించి ఖమ్మంలో ప్రకటన చేయబోతున్నారు. దీంతో తెలంగాణలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.