https://oktelugu.com/

400 గ్రాముల గంజాయి,120 ఫుల్ బాటిల్స్.. రేవ్ పార్టీలో విస్తుపోయే విషయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం గాంధీనగర్ తండాలోని ఓ ఫామ్ హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పలు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరికి మరో ముగ్గురు సహకరించినట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో ‘ఎస్ వై దమ్రూ’ అనే పేజీని క్రియేట్ చేసి యువతను ఆకర్షించినట్లు తేల్చారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2021 / 02:20 PM IST
    Follow us on


    యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం గాంధీనగర్ తండాలోని ఓ ఫామ్ హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పలు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరికి మరో ముగ్గురు సహకరించినట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో ‘ఎస్ వై దమ్రూ’ అనే పేజీని క్రియేట్ చేసి యువతను ఆకర్షించినట్లు తేల్చారు.

    Also Read: వైసీపీ మాదిరిగానే షర్మిల పార్టీ జెండా.. జగన్ ఒప్పుకుంటాడా? ప్రజలకు కన్ఫ్యూజ్ నే?

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌కు చెందిన విద్యార్థి శ్రీకర్‌ రెడ్డి, ఈసీఐఎల్‌కు చెందిన పేపర్‌ ప్రొడక్ట్‌ వ్యాపారి గిరీశ్‌ దడువాయ్, వనస్థలిపురానికి చెందిన జ్యువెల్లరీ వ్యాపారి చొల్లేటి శ్రీకాంత్, షేక్‌ ఉమర్‌ ఫారూఖ్‌ కలిసి ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. శ్రీకర్ రెడ్డి తండ్రి ధన్వంత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్‌లో ఈ పార్టీని ప్లాన్ చేశారు. పార్టీలో డ్రగ్స్ వినియోగం కోసం సూర్యాపేట జిల్లా బాలాజీనగర్‌కు చెందిన బాలెంల ప్రవీణ్ అనే వ్యక్తిని సంప్రదించారు. నిషేధిత మత్తు పదార్థాలను అతను సమకూర్చాడు.

    సోషల్ మీడియాలో ‘పీఎస్ వై దమ్రూ’ అనే పేజీని క్రియేట్ చేసి ‘మహదేవ్ గ్యాదరింగ్ ఎట్ రాచకొండ హిల్స్’ అనే ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేశారు. శివరాత్రి రోజు నిర్వహించిన పార్టీ కావడంతో మహదేవ్ అనే పేరును చేర్చారు. సోషల్ మీడియా ద్వారానే 90 మంది యువతను ఆకర్షించి ఒక్కొక్కరి నుంచి రూ.499 చొప్పున ఎంట్రీ ఫీజుగా వసూలు చేశారు. అనుకున్నట్లుగానే మార్చి11న గాంధీనగర్ తండాలోని ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ చేశారు. అయితే.. దీనిపై పక్కా సమాచారం అందడంతో ఎస్‌ఓటీ, భువనగిరి పోలీసు బృందాలు ఫామ్ హౌస్‌‌పై దాడులు నిర్వహించాయి.

    Also Read: రాజ‌కీయ వ్యూహాల్లో రాటుదేలిన ప‌వ‌న్‌.. తాజా నిర్ణ‌యంపై ప్ర‌శంస‌ల వెలువ‌!

    రేవ్ పార్టీలో పాల్గొన్న 97 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 88 మంది యువకులు, ఇద్దరు యువతులు, ఏడుగురు నిర్వాహకులు ఉన్నారు. వీరి నుంచి 400 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎల్‌ఎస్‌డీ డ్రగ్, 2 గ్రాముల గుర్తు తెలియని డ్రగ్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 120 ఆల్కహాల్ బాటిల్స్, మూడు ల్యాప్‌టాప్‌లు, 2 కెమెరాలు, 76 సెల్‌ఫోన్లు, 15 కార్లు, 30 బైక్‌లు, 21 ఎంట్రీ టికెట్లు, సిగరెట్‌ ప్యాకెట్లు, గంజాయిలో వినియోగించే ఓసీఏం పేపర్లు, రూ.27,030 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువతీ యువకులపై కేసు నమోదు చేశారు. నిర్వాహకులను రిమాండ్‌ కోసం కోర్టుకు తరలించారు. రేవ్ పార్టీ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    Tags