https://oktelugu.com/

‘కాళరాత్రి అమ్మవారు’గా ఏడవ రోజు దర్శనం..!

ఆశ్వీయుజ మాసం శుద్ధ సప్తమి నాడు అమ్మవారు కాళరాత్రి మాతగా భక్తులకు దర్శనం కల్పించనున్నారు. నవరాత్రులు ప్రారంభమై నేటితో ఎడొవ రోజు కనుక కాళరాత్రి మాతగా అమ్మవారు కొలువై ఉన్నారు. ఉదయం నుంచి కాలరాత్రి మాతగా అమ్మవారు ఇంద్రకీలాద్రిపై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. Also Read: ఇక ఆంక్షల్లేవ్.. ఏ దేశమైనా ఎగిరిపోవచ్చు! పురాణాల ప్రకారం దుర్గామాత రాక్షసుల సంహరణలో భాగంగా తను మేలిమి బంగారు వర్ణాన్ని త్యాగం చేసి నల్లటి చీకటి రంగును ధరించడం వల్ల […]

Written By: , Updated On : October 23, 2020 / 09:45 AM IST
Follow us on

Seventh day appearance as Kalaratri Ammavaru

ఆశ్వీయుజ మాసం శుద్ధ సప్తమి నాడు అమ్మవారు కాళరాత్రి మాతగా భక్తులకు దర్శనం కల్పించనున్నారు. నవరాత్రులు ప్రారంభమై నేటితో ఎడొవ రోజు కనుక కాళరాత్రి మాతగా అమ్మవారు కొలువై ఉన్నారు. ఉదయం నుంచి కాలరాత్రి మాతగా అమ్మవారు ఇంద్రకీలాద్రిపై భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

Also Read: ఇక ఆంక్షల్లేవ్.. ఏ దేశమైనా ఎగిరిపోవచ్చు!

పురాణాల ప్రకారం దుర్గామాత రాక్షసుల సంహరణలో భాగంగా తను మేలిమి బంగారు వర్ణాన్ని త్యాగం చేసి నల్లటి చీకటి రంగును ధరించడం వల్ల ఈ అమ్మవారిని కాలరాత్రి అమ్మవారు గా కొలుస్తారు. కాలరాత్రి అమ్మవారు చూడటానికి ఎంతో భయంకరంగా అనిపించినప్పటికీ అన్ని చెడు, ప్రతికూల పరిస్థితులను తొలగించి తన భక్తులను ఆశీర్వదించడం లో, వారికి రక్షణ కల్పించడంలో ఎంతో నేర్పు కలిగి ఉండటం వలన కాళరాత్రి మాతను శుంబకరి లేదా శుభప్రదమైన వ్యక్తిగా కొలుస్తారు.

Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అందుబాటులోకి ఆ సేవలు..?

నవరాత్రులలో ఏడవ రోజున అమ్మవారిని కాలరాత్రి లేదా శుంబకరి దేవి గా పూజిస్తారు. ఈ దేవత ఊపిరి పీల్చుకున్నప్పుడు వదిలేటప్పుడు తన నాసికా రంధ్రాల ద్వారా మంటలు వ్యాపిస్తాయి. తన జుట్టును వదులుకొని, నాలుగు చేతులు కలిగి ఉండి గాడిదపై భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఈ రోజు అమ్మవారిని గులాబీ వర్ణం చీరలోపూజిస్తారు. అలాగే కాల రాత్రి అమ్మవారికి నైవేద్యంగా అన్ని కూరగాయలు కలిపి కదంబం లా తయారు చేసిన కలగూర పులుసు ను సమర్పిస్తారు. తదుపరి అమ్మవారి స్తోత్రాన్ని పఠించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి భయాందోళనల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి ప్రతి దేవాలయాలలో కాలరాత్రి అమ్మవారుగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.