
ఇంగ్లండ్ తో ఇండియా మూడో టెస్ట్ అహ్మదాబాద్ లోని ‘మోతేరా’ స్టేడియంలో జరుగుతోంది. ఈ టెస్టు మ్యాచ్ తోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఈ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి కోవింద్,కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దీన్ని వేడుకగా ప్రారంభించారు.
అయితే ముందుగా ఈ స్టేడియానికి ‘సర్ధార్ పటేల్’ స్డేడియంగా పేరు పెట్టారు. కానీ తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి ‘నరేంద్రమోడీ స్టేడియం’గా పేరు మార్చడం సంచలననమైంది. అంతేకాదు స్టేడియంలోని వివిధ విభాగాలకు రిలయన్స్, అదానీ వంటి పారిశ్రామికవేత్తల పేర్లు పెట్టడం దుమారం రేపింది.
ఇన్నాళ్లు దేశ ఐక్యత కోసమంటూ ‘సర్ధార్ వల్లభాయ్ పటేల్’ను వాడుకున్న నరేంద్రమోడీ ఇప్పుడు ఏకంగా ఆయన పేరును ఇప్పుడు తొలగించడం సంచలనమైంది. బతికున్న నరేంద్రమోడీ, ప్రధానిగా ఉంటున్న వ్యక్తి పేరును ఇప్పుడే పెట్టడం రాజకీయంగా దుమారం రేపింది. సహజంగానే నేతలు రిటైర్ అయ్యాక, చనిపోయాక వారి గుర్తుగా పెడుతారు.
ఇప్పటిదాకా కాంగ్రెస్ దివంగతులు ఇందిరా-నెహ్రూ-రాజీవ్ ల పేర్లు పెడితే ఇదే బీజేపీ, నరేంద్రమోడీలు విమర్శించారు. కానీ ఇప్పుడు అదే బాటలో ఏకంగా నరేంద్రమోడీ పేరునే స్టేడియంకు పెట్టడం చర్చనీయాంశమైంది. పటేల్ పేరుతో కాంగ్రెస్ ను తిట్టే ఇదే బీజేపీ నేతలు ఇప్పుడు పటేల్ పేరు తీసేసి మోడీ పేరు పెట్టడం సంచలనమైంది. దీన్ని బట్టి దేశంలో కాంగ్రెస్ లాగానే వ్యక్తిస్వామ్యం బీజేపీలో వచ్చిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో వందల మంది మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు.