సమంత రుతుప్రభు..(Samantha) అక్కినేని వారి ఇంటి కోడలు కాకముందు సమంత అసలు పేరు ఇదే. కానీ హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక తన పేరును ‘అక్కినేని సమంత’ అని మార్పుకుంది. కానీ ఈ మధ్య ఎందుకో ‘ఎస్’ అని మాత్రమే మార్చేసింది.. అక్కినేని ఇంటిపేరును తీసేసింది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో సమంతకు విభేదాలు వచ్చాయని.. వారిద్దరూ దూరంగా ఉంటున్నారని..విడిపోయారని వార్తలు వచ్చాయి.
సమంతను సోషల్ మీడియా వేదిక ప్రశ్నలతో నెటిజన్లు హోరెత్తించారు. కొంతమంది అయితే ట్రోల్స్ కూడా చేశారు. సోషల్ మీడియాలో సమంత పేరు ఎందుకు మార్చుకుందన్నది హాట్ టాపిక్ గా మారింది. దానిపై స్పందించాలని చాలా మంంది కోరినా సమంత మాత్రం నోరు మెదపలేదు.
తాజాగా తన పేరు మార్చుకోవడంపై బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో సమంత నోరు విప్పింది. ‘పేరు మార్పుపై స్పందించాలని అనుకోవడం లేదు. ఇప్పుడే కాదు.. ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్2’ విడుదలైన సమయంలోనూ తనపై విమర్శలు వచ్చాయి. దీని గురించి ఏదైనా చెప్పండి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కోరుతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించి సుమారు 65000 ట్వీట్లు పెట్టారు. కానీ నాకు జవాబు ఇవ్వాలనిపించలేదు. సంబంధిత విషయాలపై నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతా’ అంటూ సమంత ముగించింది.
నిజంగా నాగచైతన్యతో విభేదాలు లేకుంటే సమంత ఇలా చేసి ఉండేది కాదని.. వారి మధ్య ఏదో గ్యాప్ రాబట్టే ఆ విషయం పై స్పందించనని సమంత తప్పించుకుందని కామెంట్లు వినపడుతున్నాయి. సమంత తాజాగా తన పేరు మార్పుపై స్పందించకపోవడంతో వారి మధ్య విభేదాలు నిజమేనా? అన్న చర్చ కూడా సాగుతోంది.