
రోహిత్ శర్మకు వన్డే, టీ20 కెప్టెన్సీ అప్పగిస్తారన్న వార్తలను బీసీసీఐ ఖండించింది. కెప్టెన్ మార్పు గురించి అసలు బీసీసీఐ చర్చించలేదు. టెస్టులు, వన్డేలు, టీ20లకు విరాట్ కోహ్లీనే సారథిగా కొనసాగుతాడు అని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని రోహిత్ శర్మకు అప్పగిస్తారని బీసీసీఐ చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.