
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, వెటరన్ బ్యాట్సమన్ మాథ్యూ హేడెన్ పాకిస్థాన్ మెన్స్ క్రికెట్ కోచ్ గా ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్ కప్ కు పాక్ జట్టు కోచ్ గా బాధ్యతలు నిర్వరి్తంచనున్నాడు. ఈ మేరకు పీసీబీ ప్రకటన చేసింది. ఇక సౌతాఫ్రికా మాజీ బౌలర్ వెర్నన్ ఫిలాండర్ బౌలింగ్ కోచ్ గా పనిచేయనున్నాడు. పాక్ బోర్డుతో విభేదాల నేపథ్యంలో కోచ్ మిస్బా, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు.