Homeఎంటర్టైన్మెంట్Jagapathi Babu: జగపతి బాబు పడి లేచిన కెరటం !

Jagapathi Babu: జగపతి బాబు పడి లేచిన కెరటం !

Jagapathi Babu : Cinematic Career Went On Like A Rising Tide

Jagapathi Babu: జగపతి బాబు(Jagapathi Babu) హీరోగా బాగానే సంపాదించారు. అయితే, ఆయన సహచరులని నమ్మి, వారికి ఉదారంగా డబ్బులు ఇచ్చి కొంత నష్టపోయారు. దానికి తోడు సరైన ఆర్థిక క్రమశిక్షణ లేక డబ్బులు అన్ని పోగొట్టుకుని ఆస్తులు అముకున్నారు. ఓ దశలో చాలా కష్టాలు పడ్డారు. పైగా తానూ పడిన కష్టాలు గురించి తానే బాహాటంగా బయటకు చెప్పారు. ఆ ఆర్థిక కష్టాలలో చివరికి తన తండ్రి బంగారు మొలతాడు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.

ఆ సమయంలోనే తన కూతురు అమెరికాకి చెందిన వ్యక్తిని ప్రేమించింది. అయితే, అతన్ని ప్రేమ పెళ్లి చేసుకుని తానూ ఖర్చు పెట్టలేని రోజులలో పెళ్లి ఖర్చులను తప్పించింది అని దైర్యంగా బయటకు చెప్పిన హీరో జగపతి బాబు. ఒక హీరో ఇలా చెప్పడం నిజంగా సాహసమే. నిజానికి ఇలా నిర్భయంగా నా కూతురు పెళ్లి చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడానికి సాధారణ వ్యక్తి కూడా ఇష్టపడడు.

పైగా తన కూతురు పెళ్లి సమయంలో కొందరు ఆయన కులస్తులు చాలా వ్యతిరేకించారట. మన వాళ్ళు అయి ఉండి, ఇలా బయట దేశస్తుడికి ఇచ్చి పెళ్లి చేసి తప్పు చేయవద్దు అని ఒత్తిడి చేశారట. ఇవ్వన్నీ ఓ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్ గా చెప్పుకొచ్చాడు జగపతిబాబు. ఎందుకు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు అని సదురు యాంకర్ అడిగితే,

మన సమాజం చాలా కృత్రిమమైనది అయిపోయింది, కాబట్టి ఎవరో ఒకరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కదా అంటూ తనదైన శైలిలోనే జగపతిబాబు చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా పడి లేచిన కెరటంలా జగపతి బాబు సినీ కెరీర్ సాగింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular