
తెలంగాణలో అవినీతి అంతమెందించేందుకు సీఎం కేసీఆర్ పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణలో అవినీతి.. అక్రమాల్లో తొలిస్థానంలో నిలిచిన రెవిన్యూ శాఖపై ఆయన దృష్టిసారించారు. తాజాగా జరిగిన వర్షకాల అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. రెవిన్యూ వ్యవస్థలో కీలకమైన వీఆర్వో వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశారు. దీంతో రైతులంతా పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.
Also Read: ప్రజలకు మేలు చేసే కేటీఆర్ కొత్త ప్లాన్
రెవిన్యూ కార్యాలయంలో పని జరుగాలంటే.. పైసలు ముట్టచెప్పాల్సిందే.. జేబులు తడువనిదే.. ఫైలు ముందుకెళ్లదనే అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించేందుకు జీతాలు ఇస్తుంటే అధికారులు అవి మరిచిపోయే జలగల్లా సామాన్యులను పీల్చిపిప్పీ చేస్తున్నారు. రెవిన్యూ అధికారుల ఆగడాలకు విసిగిపోయిన ఓ రైతు అప్పట్లో తహసీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పంటించడం సంచలనంగా మారింది. ఈ సంఘటన తర్వాత రెవిన్యూ అధికారుల అవినీతిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండటంతో సీఎం కేసీఆర్ రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళికే మొగ్గుచూపారు.
ఇటీవల కొత్త రెవిన్యూ యాక్ట్ కు ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. అయితే ఒక్క శాఖలో అవినీతి నాశిస్తే మిగతా వాళ్లలో మార్పు వస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వంలో అవినీతిలో రెండోస్థానంలో ఉన్న పోలీస్ శాఖపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏసీబీ అధికారులు పోలీస్ శాఖకు చెందిన పలువురు అవినీతి అధికారులను వలపన్నీ పట్టుకుంటున్నారు. వరుసగా పోలీస్ శాఖకు చెందిన అధికారులు ఏసీబీకి పట్టుబడుతుండటంతో పోలీసులు గుండెల్లో గుబులు పుడుతోందనే టాక్ విన్పిస్తోంది.
తాజాగా మల్కాజిగిరి ఏసీపీపై ఏసీబీ అధికారులు దాడులు చేయగా ఆయన వందలకోట్ల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్లు వెలుగుచూసింది. దీంతోపాటు గతంలో షాబాద్ ఇన్‌స్పెక్టర్, ఏఎస్‌ఐ అధికారులను అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే ఓ ఫిర్యాదుదారుడి వద్ద రూ. 1.2 లక్షలు లంచం తీసుకుంటుంగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వీరి ఇళ్లలో సోదాలు చేయగా రూ. 5కోట్ల అక్రమాస్తులు వెలుగు చూశాయి. కొద్దిరోజులుగా ఏసీబీ అధికారులకు పోలీస్ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారు. దీంతో ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను సైతం ప్రక్షాళన చేసేందుకు రెడీ అయిందనే వాదనలు విన్పిస్తున్నాయి.
Also Read: కొడాలి నాని.. తెలుసుకొని మాట్లాడు.. ఇదీ మోడీ రామభక్తి
కొందరు అవినీతి అధికారుల వల్ల మొత్తం పోలీస్ శాఖకే మాయని మచ్చ వస్తుండటంతో నిజాయితీపరులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఏసీబీ అధికారుల పుణ్యామా అని ప్రభుత్వం పోలీస్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తే సగానికి పైగా అవినీతి రాష్ట్రంలో దూరం అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇకనైనా పోలీస్ శాఖలో జరుగుతున్న అవినీతిపై దృష్టిసారిస్తారో లేదో వేచిచూడాల్సిందే..!