Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్రైతు సంక్షేమానికే  బీజేపీ కొత్త చట్టం : పవన్‌

రైతు సంక్షేమానికే  బీజేపీ కొత్త చట్టం : పవన్‌

రైతు సంక్షేమానికే  బీజేపీ సర్కార్‌  కొత్త వ్యవసాయ చట్టం తీసుకొచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా గురువారం మాట్లాడారు. రైతుల సమస్యలను జనసేన నాయకులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ చట్టంతో రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు. రైతులను బలోపేతం చేయడం.. వారికి కొత్త అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా సంస్కరణలు తేవడానికే ప్రధానమంత్రి మోదీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వ్యాఖ్యానించారు. రైతుల కిసాన్ బిల్లులో సవరణకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. కొంతమంది కావాలని ఈ చట్టంపై రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను కేంద్రం పరిష్కరిస్తుందని చెప్పారు.

 

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version