ఐపీఎల్ వేలంలో రికార్డు బద్దలు: ఈ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించారు

ఐపీఎల్ వేలంగా పోటాపోటీగా సాగింది. తొలి సారి వేలంలో అత్యధిక పాట పడి రికార్డు బద్దలైంది. ఇప్పటివరకు వేలంలో అత్యధిక వేలం పలికిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ ఉండేవాడు.కానీ ఇప్పుడది బద్దలైంది. ఆ రికార్డును దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ బద్దలు కొట్టాడు. Also Read: ఐపీఎల్‌ వేళానికి వేళాయె.. ఐపీఎల్ తాజా వేలంలో ఆల్ రౌండర్లకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. ప్రధానంగా దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రికార్డును తిరగరాశాడు. ఐపీఎల్ వేలం […]

Written By: NARESH, Updated On : February 18, 2021 7:10 pm
Follow us on

ఐపీఎల్ వేలంగా పోటాపోటీగా సాగింది. తొలి సారి వేలంలో అత్యధిక పాట పడి రికార్డు బద్దలైంది. ఇప్పటివరకు వేలంలో అత్యధిక వేలం పలికిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ ఉండేవాడు.కానీ ఇప్పుడది బద్దలైంది. ఆ రికార్డును దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ బద్దలు కొట్టాడు.

Also Read: ఐపీఎల్‌ వేళానికి వేళాయె..

ఐపీఎల్ తాజా వేలంలో ఆల్ రౌండర్లకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. ప్రధానంగా దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రికార్డును తిరగరాశాడు. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఘనత సాధించాడు. 2021 సీజన్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మోరిస్ ను ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. ఇప్పటివరకు యువరాజ్ పేరిట 16 కోట్ల ధర రికార్డు ఉండేది. 2015లో యూవీని ఢిల్లీ కొన్నది. ఇప్పుడు ఆ రికార్డును క్రిస్ మోరిస్ బద్దలు కొట్టాడు. బెంగళూరు జట్టు క్రిస్ మోరిస్ ను విడుదల చేయగా అన్ని జట్లు పోటీపడి ధరను పెంచాయి.

ఇక ఆల్ రౌండర్లు మెయిన్ అలీకి 7 కోట్లు, శివమ్ దూబె 4.4 కోట్లు, షకీబ్ అల్ హాసన్ కు 3.2 కోట్లు భారీ ధర పలికింది.

గత సీజన్ లో పంజాబ్ తరుఫున ఆడి విఫలమైన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మాక్స్ వెల్ కూడా ఈ వేలం పాటలో భారీ ధర పొందాడు. బెంగళూరు అతడిని ఏకంగా రూ.14.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

Also Read: ఇంగ్లండ్ తో చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే.. మార్పులివే..

ఇక మరో ఆస్ట్రేలియన్ పేసర్ రిచర్డ్ సన్ ను పంజాబ్ జట్టు ఏకంగా 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక చెన్నై జట్టు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మెయిన్ అలీని 7 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇక బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ హల్ హాసన్ను కోల్ కతా 3.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గతంలోనే కోల్ కతా తరుఫున షకీబ్ ఆడాడు. ఈ బంగ్లా ఆటగాడి బెంగాలీ జట్టుకే ఆడడం విశేషం.

భారత యువ ఆల్ రౌండర్ శివమ్ దూబెను ఈసారి రాజస్థాన్ 4.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.