
లౌక్యం తెలిసిన హీరోయిన్లు వారి తల్లుల్లు ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న నానుడిని గుడ్డిగా ఫాలో అయిపోతారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే సినిమా జనం ఎలా ఉంటారు, ఎంత కమర్షియల్ గా ఉంటారు అనేది వాళ్లకు అర్ధమైపోతుంది. దాంతో మంచి నేపథ్యం నుండి వచ్చిన హీరోయిన్లు కూడా.. సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో పడతారు. అదే కరెక్ట్ కూడా. మరి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్సిన తరువాత, అవకాశాల కోసం ఎంత పొగొట్టుకొవాలి ? అలాగే ఎన్ని కష్టాలు పడాలి, ముఖ్యంగా మేనేజర్ తో మొదలుపెట్టి కో డైరెక్టర్ వరకూ ఇలా చాలమందికి వచ్చిన రెమ్యూనరేషన్ లో పర్సెంటేజ్ లు ఇవ్వాలి.
ఇలా చెప్పుకుంటే పోతే హీరోయిన్ కష్టాలతోనే మంచి కమర్షియల్ సినిమా కూడా తీయొచ్చు. అందుకే ఒక్క సక్సెస్ వచ్చినా హీరోయిన్ ముందు చేసే పని రెమ్యునరేషన్ ను పెంచడం. బయట నుండి చూసేవారికీ చాల స్పీడ్ గా రెమ్యూనరేషన్ ను పెంచుకుంటూ పోతుందే అనిపిస్తోంది గానీ, ఆ స్థాయికి రావడానికి ఎన్ని సంవత్సరాల కష్టం ఉంటుందో మాటల్లో చెప్పలేము. మొత్తంగా చెప్పొచ్చేది ఏమిటంటే.. హీరోయిన్లు రెమ్యునరేషన్ ను పెంచడం అనేది తప్పు కాదు అని.
అయితే, అది ఈ హీరోయిన్ విషయంలో మాత్రం మినహాయింపు ఉంది. ఆ హీరోయినే క్రేజీ బ్యూటీ రష్మిక మండన్నా. ఈ అందాల భామ హిట్ కి ప్లాప్ కి సంబంధం లేకుండా.. సినిమా సినిమాకి రెమ్యునరేషన్ ను పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప సినిమా చేస్తోంది. కాగా ఈ సినిమా కోసం ఈ బ్యూటీ ఏకంగా కోటి డెబ్బై లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇప్పుడు కొత్తగా ఆమెకు ఒక తమిళ సినిమా వచ్చింది, పైగా ఆ సినిమాలో హీరో విజయ్. అయితే ఆ సినిమాలో నటించాలి అంటే.. తనకు రెండున్నర కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తోందట.
అసలు రష్మిక మొదటి సినిమా ‘ఛలో’ సినిమాకి ఆమెకు పది లక్షలు ఇచ్చారు, ‘గీతగోవిందం’కి నలభై లక్షలు ఇచ్చారు, ఆ తరువాత సినిమాలకు కూడా ఇంచుమించుగా అంతే తీసుకుంది. కానీ, ఒక్క ‘పుష్ప’ సినిమాతో కోటి పెంచింది, ఇప్పుడు పుష్ప తర్వాత సినిమాకి ఏకంగా రెండు కోట్లు పెంచింది. ఇలా ఒక్కో సినిమా పెరిగేకొద్దీ ఒక్కో కోటి పెంచుకుంటూ పోతే.. రష్మికా.. నిర్మాత అడుక్కు తినాల్సిందే.