మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా రాణిస్తున్నాడు. కొణిదల ప్రొడక్షన్ బ్యానర్లో భారీ సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు వచ్చిన మూవీలన్నీ తన తండ్రి మెగాస్టార్ తో చేసినవే ఉన్నాయి. ‘ఖైదీ-150’, ‘సైరా’ మూవీలు ఈ బ్యానర్లో రిలీజ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. తాజాగా ‘చిరు-152’ మూవీ తెరకెక్కుతుంది. అలాగే మెగాస్టార్ కోసం మలయాళ మూవీ ‘లూసీఫర్’ హక్కులను దక్కించుకున్నాడు. ఈ మూవీని రంగస్థలం దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్నడని తెలుస్తోంది.
రాంచరణ్ తాజాగా మళయాళ ఇండస్ట్రీకి చెందిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీని దక్కించుకున్నాడు. ఈ మూవీని మెగాస్టార్ తో కాకుండా వేరో హీరోతో నిర్మించబోతున్నాడు. ఈ కథ విక్టరీ వెంకటేష్ కు సరిగ్గా సరిపోతుందని రాంచరణ్ భావిస్తున్నాడు. దీంతో ‘వెంకీమామ’తో మాట్లాడి నటింపజేయాలని చూస్తున్నాడు. వెంకటేష్ ఇటీవలే ‘ఎఫ్-2’, ‘వెంకీమామ’ మూవీలతో భారీ సక్సస్ అందుకున్నాడు. తాజాగా ‘నారప్ప’ మూవీలో చేస్తున్నాడు. ఈ మూవీలో వెంకటేష్ సరసన అమలాపాల్ నటిస్తుంది. ఈ మూవీలో త్వరలోనే పూర్తికానుంది. రీమేక్ లతో భారీ సక్సస్ అందుకునే విక్టరీ వెంకటేశ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో రాంచరణ్-వెంకీ కాంబినేషన్లో ఈ మూవీ పట్టాలెనుందని ప్రచారం జరుగుతుంది.
కొణిదల ప్రొడక్షన్ బ్యానర్ స్థాపించినపుడే రాంచరణ్ మెగా హీరోలతోనే కాకుండా అందరి హీరోలతో సినిమాలు చేస్తానని, కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పాడు. కాగా ఇప్పటివరకు ఆయన బ్యానర్లో చిరంజీవి మూవీలే వచ్చాయి. తొలిసారి మెగాస్టార్ కాకుండా వేరే హిరోతో సినిమా చేసేందుకు రాంచరణ్ సిద్ధమయ్యాడు. దీంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీలపై మిగతా మెగా హీరోలు కన్నేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ తో బాక్సాఫీస్ రికార్డులు సాధించిన కొణిదల ప్రొడక్షన్ మరోమారు వెంకీమామతో ‘విక్టరీ’ కొట్టేందుకు సిద్ధపడుతుంది. ప్రస్తుతం రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ బీజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత విక్టరీ వెంకటేష్ మూవీ ఉండనుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రాంచరణ్ అధికారిక ప్రకటన చేయనున్నాడు.