
బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. కరోనా లాక్ డౌన్ లేకపోతే ఈ సినిమా ఇప్పటికీ పూర్తి అయ్యి ఉండేది. కానీ కరోనాతో పూర్తిగా మరుగునపడిపోయింది.
Also Read: ‘బాలయ్య’ గ్యాప్ లేకుండా ఒప్పుకుంటున్నాడు !
ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళితోపాటు, నిర్మాత దానయ్య కూడా కరోనా బారినపడి కోలుకున్నారు. ప్రస్తుతం అందరు హీరోలు షూటింగ్ లుచేయడానికి బయటకు వస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ కూడా షూటింగ్ కు సై అన్నట్టు సమాచారం. అందుకే రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 80శాతం పూర్తయిన ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో మిగిలిన 20శాతం పూర్తి చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడట.. హీరోలు, హీరోయిన్ల డేట్స్ అన్నింటిని తీసుకునే పనిలో పడ్డాడట.. ఈ సినిమాలోని మిగతా షూటింగ్ అంతా రామౌజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో పూర్తి చేయడానికి రాజమౌళి ప్లాన్ చేసినట్టు తెలిసింది. రెండు నెలలు కంటిన్యూగా షూటింగ్ ప్లాన్ చేసినట్టు రాజమౌళి తెలిపారు.
Also Read: మహేష్ బాబు ‘డబుల్’ ధమకా.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్..!
ఈ రెండు నెలలు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆ తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తామని.. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ చెప్పలేమని రాజమౌళి వివరించారు. అయితే ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ ను దసరా లేదా.. దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు రాజమౌళి. దీన్ని వచ్చే సమ్మర్ లేదా వచ్చే జూన్ వరకు ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.