
సాధారణంగా బర్త్‌డేలు అంటే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటాం. లేదంటే ఆ వేడుకను సెలబ్రేట్ చేస్తుంటాం. మంచి పార్టీ చేసుకుంటాం. ఇక సినిమా వారితే ఆ హీరోతో సినిమా చేస్తున్న ఆ డైరెక్టర్ టీజర్ రిలీజ్ చేయడమో.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇస్తుంటారు.
Also Read: అనుష్కనే కావాలి.. ఆ దర్శకుడికి ఫ్యాన్స్ రిక్వెస్ట్..!
కానీ.. నేడు బర్త్‌డే జరుపుకుంటున్న దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళికి.. తను తాజాగా తీస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీం వెరైటీ శుభాకాంక్షలు చెప్పింది. రొటీన్ విషెస్ కాకుండా ఆయనలోని నిబద్ధతను, సింప్లిసిటీని, పెర్ఫెక్షన్‌ను ఎలివేట్ చేస్తూ విష్ చేసింది.
‘ఒక్క పట్టాన సంతృప్తి చెందడు.. దర్శక రాక్షసుడు.. చెక్కుతూనే ఉంటాడు’ అంటూ ఎన్టీయార్ విసుక్కోగా.. ఒక సీన్ ఎలివేషన్ గురించి, యాక్షన్ సీన్స్ విషయంలో రాజమౌళి పెట్టే ఇబ్బందుల గురించి రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు. ఇంకా, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌తోపాటు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర సిబ్బంది కూడా రాజమౌళిపై సరదా సరదా ఆరోపణలు చేశారు.
బర్త్ డే సందర్భంగా ఎవరైనా పొగుడుతూ రాజమౌళికి శుభాకాంక్షలు చెబుతారు. కానీ వెరైటీగా రాజమౌళిని పనిరాక్షసుడిగా చూపిస్తూ ఎన్టీఆర్, చరణ్ లాంటి స్టార్ హీరోలు కామెంట్ చేయడం నిజంగానే వైరల్ అయ్యింది. సినిమా విషయంలో రాజమౌళి ఫ్యాషన్, పిచ్చి అనేది వారి మాటల ద్వారా వెల్లడైంది.
Also Read: ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను లైన్లో పెట్టిన త్రివిక్రమ్..!
అయితే ఇంత నెగెటివ్ గా మాట్లాడినా అది రాజమౌళిలోని పాజిటివ్ నే ఎత్తి చూపింది. రాజమౌళి అంటే ఏంటో జనాలకు తెలిసొచ్చింది. అంత స్టిక్ట్ గా ఉంటాడు కాబట్టే అంత పర్ ఫెక్ట్ గా ఆయన సినిమాలు తెరమీద వస్తాయని అర్థమవుతోంది.