‘హ్యాపీడేస్’ అనే సినిమా అప్పట్లో అంటే.. 14 ఏళ్ల కిందట ఒక సంచలనం. కాలేజీ లైఫ్ ఎంత బాగుంటుందో చాటి చెప్పిన సినిమా ఇది. ఈ సినిమా చూసి ఇంజనీరింగ్ లో జాయిన్ వాళ్ళు వేలమంది ఉన్నారంటేనే ఈ సినిమా ప్రభావం ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పైగా శేఖర్ కమ్ములను డైరెక్టర్ గా మరో మెట్టు ఎక్కించిన ఈ సినిమా కూడా ఇదే,
అన్నిటికి మించి ఇండస్ట్రీకి కొత్త వాళ్ళను అందించింది ఈ సినిమా. వారిలో తమన్నా, నిఖిల్ లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఫామ్ లో కొనసాగుతున్నారు. ఇక వరుణ్ సందేశ్ ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఇక హ్యాపీడేస్ సినిమాలో జనాలకు బాగా కనెక్ట్ అయిన పాత్రలలో కీలకమైన పాత్ర ‘టైసన్’.
టైసన్ పాత్రలో తన నటనతో పరిపూర్ణంగా ఆకట్టుకున్నాడు రాహుల్. అయితే ఈ సినిమా చేస్తోన్న సమయంలో రాహుల్ మరీ బక్కగా ఉండేవాడు. అందుకే, అందరూ అతడిని బయట కూడా వెటకారంగా టైసన్ అని ఆటపట్టిస్తుండే వారట. ఇప్పుడు రాహుల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
కండలు తిరిగిన దేహం, మీసకట్టుతో మాస్ హీరోలా కనిపిస్తున్నాడు. సరికొత్త లుక్ లో కనిపిస్తోన్న రాహుల్ ను చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఒకసారి రాహుల్ లుక్ పై మీరు కూడా లుక్కేయండి.