Homeఅత్యంత ప్రజాదరణరచ్చ కంటిన్యూ.. నాగబాబు స్ట్రాంగ్ పంచ్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్..!

రచ్చ కంటిన్యూ.. నాగబాబు స్ట్రాంగ్ పంచ్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్..!

nagababu pawan kalyan prakash raj

గ్రేటర్ ఎన్నికలు సెలబ్రెటీల మధ్య చిచ్చు పెడుతున్నాయి. టాలీవుడ్లోని సెలబ్రెటీలు రెండువర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రధానంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా హోరాహోరీ ప్రచారం నడుస్తోంది. దీంతో సెలబ్రెటీలు సైతం కొందరు టీఆర్ఎస్ కు వంతపడుతుంటే మరికొందరు బీజేపీ పక్షాన నిలుస్తున్నారు.

Also Read: విక్రమ్ నుండి క్లారిటీ.. పుష్ప బాధ పోగొట్టేవాళ్లు ఎవరో ?

జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇచ్చారు. ఈనేపథ్యంలోనే పలువురు సెలబ్రెటీలు పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నటుడు ప్రకాశ్ రాజ్ జనసేన అధినేత ఉసరవెల్లి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకాశ్ రాజ్ పై ఎదురుదాడికి దిగారు.

ప్రకాశ్ రాజ్ పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు మెగాబద్రర్ నాగబాబు నేరుగా రియాక్ట్ అయ్యారు. ‘పవన్ కల్యాణ్ ను ప్ర‌తీ ప‌నికి మాలిన‌వాడూ.. విమ‌ర్శించేవాడే.. మిస్ట‌ర్ ప్ర‌కాష్ రాజ్‌.. నీ రాజ‌కీయ డొల్ల‌త‌నం ఏమిటో.. బీజేపీ లీడ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి డిబేట్ లోనే మాకు అర్థ‌మైంది. నిన్ను తొక్కి పెట్టి నారతీస్తుంటే.. మాట్లాడ‌లేక త‌డ‌బ‌డ‌డం ఇంకా గుర్తుంది’ అంటూ ప్ర‌కాష్ రాజ్ కు నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Also Read: బీసీ టైటిల్ తో ఎమోషనల్ మూవీ !

డ‌బ్బుల కోసం నిర్మాత‌లను హింసించి.. ఇచ్చిన డేట్స్ కాన్సిల్ చేసి.. కాల్చుకుతింటావ్ అంటూ ప్రకాశ్ రాజ్ పై నాగబాబు తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డాడు. ముందు ఓ మంచి మ‌నిషిగా మారి ఆ తర్వాత విమ‌ర్శించు అంటూ నాగబాబు హిత‌వు ప‌లికాడు. నాగబాబు వ్యాఖ్యలకు నేడు ప్రకాశ్ రాజ్ ట్వీటర్లో కౌంటర్ ఇస్తూ రచ్చను కంటిన్యూ చేశాడు.

‘గౌరవనీయులైన నాగబాబు గారికి.. మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ నాకు అర్థమైంది. నాకు దేశం మీద ఉన్న ప్రేమను మీరు అర్థం చేసుకోండి.. నాకు తెలుగు భాష వచ్చు.. కానీ మీ భాష రాదు’ అంటూ ప్రకాష్ రాజ్ తెలుగులో ట్వీట్ చేశారు. దీనికి #Justasking అనే హ్యాష్ ట్యాగ్ తో నాగబాబుని ట్యాగ్ చేసిన ప్రకాష్.. దండాలు పెడుతున్న ఎమోజీలు ఉంచడం కొసమెరుపు. అయితే ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై నాగబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version