గ్రేటర్ ఎన్నికలు సెలబ్రెటీల మధ్య చిచ్చు పెడుతున్నాయి. టాలీవుడ్లోని సెలబ్రెటీలు రెండువర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రధానంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా హోరాహోరీ ప్రచారం నడుస్తోంది. దీంతో సెలబ్రెటీలు సైతం కొందరు టీఆర్ఎస్ కు వంతపడుతుంటే మరికొందరు బీజేపీ పక్షాన నిలుస్తున్నారు.
Also Read: విక్రమ్ నుండి క్లారిటీ.. పుష్ప బాధ పోగొట్టేవాళ్లు ఎవరో ?
జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇచ్చారు. ఈనేపథ్యంలోనే పలువురు సెలబ్రెటీలు పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నటుడు ప్రకాశ్ రాజ్ జనసేన అధినేత ఉసరవెల్లి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకాశ్ రాజ్ పై ఎదురుదాడికి దిగారు.
ప్రకాశ్ రాజ్ పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు మెగాబద్రర్ నాగబాబు నేరుగా రియాక్ట్ అయ్యారు. ‘పవన్ కల్యాణ్ ను ప్రతీ పనికి మాలినవాడూ.. విమర్శించేవాడే.. మిస్టర్ ప్రకాష్ రాజ్.. నీ రాజకీయ డొల్లతనం ఏమిటో.. బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి డిబేట్ లోనే మాకు అర్థమైంది. నిన్ను తొక్కి పెట్టి నారతీస్తుంటే.. మాట్లాడలేక తడబడడం ఇంకా గుర్తుంది’ అంటూ ప్రకాష్ రాజ్ కు నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
Also Read: బీసీ టైటిల్ తో ఎమోషనల్ మూవీ !
డబ్బుల కోసం నిర్మాతలను హింసించి.. ఇచ్చిన డేట్స్ కాన్సిల్ చేసి.. కాల్చుకుతింటావ్ అంటూ ప్రకాశ్ రాజ్ పై నాగబాబు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. ముందు ఓ మంచి మనిషిగా మారి ఆ తర్వాత విమర్శించు అంటూ నాగబాబు హితవు పలికాడు. నాగబాబు వ్యాఖ్యలకు నేడు ప్రకాశ్ రాజ్ ట్వీటర్లో కౌంటర్ ఇస్తూ రచ్చను కంటిన్యూ చేశాడు.
‘గౌరవనీయులైన నాగబాబు గారికి.. మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ నాకు అర్థమైంది. నాకు దేశం మీద ఉన్న ప్రేమను మీరు అర్థం చేసుకోండి.. నాకు తెలుగు భాష వచ్చు.. కానీ మీ భాష రాదు’ అంటూ ప్రకాష్ రాజ్ తెలుగులో ట్వీట్ చేశారు. దీనికి #Justasking అనే హ్యాష్ ట్యాగ్ తో నాగబాబుని ట్యాగ్ చేసిన ప్రకాష్.. దండాలు పెడుతున్న ఎమోజీలు ఉంచడం కొసమెరుపు. అయితే ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై నాగబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్