https://oktelugu.com/

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.4 లక్షలు పెడితే రూ.8 లక్షలు..? 

తక్కువ సమయంలోనే అదిరిపోయే రాబడిని సొంతం చేసుకోవాలని అనుకునే వారికి పోస్టీఫీస్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉండగా పోస్టాఫీస్ లో చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఉండగా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. పోస్టాఫీస్ ఆఫర్ చేస్తున్న స్కీమ్ లలో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కూడా ఒకటి. ఎవరైతే ఈ స్కీమ్ లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 20, 2021 / 10:41 AM IST
    Follow us on

    తక్కువ సమయంలోనే అదిరిపోయే రాబడిని సొంతం చేసుకోవాలని అనుకునే వారికి పోస్టీఫీస్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉండగా పోస్టాఫీస్ లో చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఉండగా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. పోస్టాఫీస్ ఆఫర్ చేస్తున్న స్కీమ్ లలో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కూడా ఒకటి.

    ఎవరైతే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ల డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. కనిష్టంగా రూ.1000 ఉంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండగా ఈ స్కీమ్ లో చేరేవారికి గరిష్ట పరిమితి లేదు. వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అయిన ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 124 నెలల్లో డబ్బులు రెట్టింపు అవుతాయి. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై 6.9 శాతం వడ్డీ వస్తుండటం గమనార్హం.

    మీరు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినా కచ్చితంగా ఆ మొత్తానికి రెట్టింపు డబ్బును పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఉదాహరణకు 4 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 8 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. కచ్చితంగా ఇన్వెస్ట్ చేసిన మొత్తం డబుల్ కావడంతో పాటు ఎటువంటి రిస్క్ ఉండదు కాబట్టి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

    సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లకు ఈ స్కీమ్ ప్రస్తుతం ఉన్న స్కీమ్ లలో బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.