Site icon OkTelugu

గొడవ ఆపేందుకు వెళ్లిన గర్భిణి మృతి

గొడవ పడుతున్న అన్నదమ్ములను నిలువరించేందుకు వెళ్లిన ఐదు నెలల గర్భిణి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో పెంటయ్య కుమారుల మధ్య నిన్న గొడవ జరుగుతండగా స్థానికంగా ఉన్న మహిళ వారిని ఆపేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో ఘర్షణ పడుతున్న ఇద్దరిలో ఓ వ్యక్తి గర్భిణిపై దాడి చేశాడు. గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గర్భిణి నిన్న రాత్రి మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version