అచ్చెన్నను మళ్లీ జైలుకు పంపిన వైసీపీ సర్కార్

ఏపీ టీడీపీ అధ్యక్షుడు గత చంద్రబాబు పాలనలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను ఎన్ని మాటలు అన్నాడో అసెంబ్లీ సాక్షిగా చూశాం.. జగన్ ‘దొంగ.. లక్ష కోట్ల దోపిడీ’ అంటూ చాలా మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది. అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలోకి జారాడు. ఏపీ సీఎం జగన్ సీఎం అయ్యారు. దీంతో నాటి ప్రతీకారానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఈఎస్ఐ మందులో స్కాంలో ఆ శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన […]

Written By: NARESH, Updated On : February 2, 2021 9:37 am
Follow us on

achenna jagan will take a photo

ఏపీ టీడీపీ అధ్యక్షుడు గత చంద్రబాబు పాలనలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను ఎన్ని మాటలు అన్నాడో అసెంబ్లీ సాక్షిగా చూశాం.. జగన్ ‘దొంగ.. లక్ష కోట్ల దోపిడీ’ అంటూ చాలా మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది. అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలోకి జారాడు. ఏపీ సీఎం జగన్ సీఎం అయ్యారు. దీంతో నాటి ప్రతీకారానికి అడుగులు పడుతున్నాయి.

ఇప్పటికే ఈఎస్ఐ మందులో స్కాంలో ఆ శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన జగన్ సర్కార్ తాజాగా మరో బాంబు పేల్చింది. ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో వైసీపీ అభ్యర్థి, ఆయన అన్నకొడుకు అప్పనన్ను నామినేషన్ వేయకుండా బెదిరించినందుకు ఏకంగా ఈ ఉదయం అరెస్ట్ చేసి జైలుకు పంపింది.

పంచాయతీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన అన్నకొడుకు కింజరపు అప్పన్న వైసీపీ తరుఫున బరిలోకి దిగాడు. దీన్ని అచ్చెన్న ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు. నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ నుంచి నామినేషన్ వేసేందుకు సిద్ధమైన అప్పన్నపై బెదిరింపులకు దిగాడు. ఫోన్లో బెదిరించాడు.తన సోదరుడి కుమారుడైన అప్పన్నను నామినేషన్ వేయొద్దని.. ఫోన్ చేసి ఆపే ప్రయత్నం చేశారని నియోజకవర్గంలో ఓ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక తన అనుచరులను పంపి అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నాడు. పత్ారలు చించేశాడు. ఇలా అచ్చెన్న నానా హంగామా సృష్టించాడు. వైసీపీ నాయకులు కూడా అప్పన్న వెంట నడవడంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలోనే అప్పన్న స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయమే అరెస్ట్ చేశారు.