https://oktelugu.com/

పోలీసులతోనే దండాలు.. చంద్రబాబు ప్లాన్ పారలేదుగా?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో నిజంగానే గొప్పనటుడు చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మీడియా అటెన్షన్ ను ఎలా తనవైపు తిప్పుకోవాలి.? మీడియా ముందట ఎలా ప్రవర్తించాలి? జనంలో సానుభూతి ఎలా పొందాలన్న దానిపై చంద్రబాబును మించిన నవరస నటనా సార్వభౌముడు మరొకరు లేరని తాజాగా తేటతెల్లమైంది. Also Read: మరో చిచ్చు పెట్టిన నిమ్మగడ్డ రమేశ్ చంద్రబాబు తిరుపతి ఎయిర్ పోర్టులో బైటాయించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో చంద్రబాబు […]

Written By: , Updated On : March 1, 2021 / 09:18 PM IST
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో నిజంగానే గొప్పనటుడు చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మీడియా అటెన్షన్ ను ఎలా తనవైపు తిప్పుకోవాలి.? మీడియా ముందట ఎలా ప్రవర్తించాలి? జనంలో సానుభూతి ఎలా పొందాలన్న దానిపై చంద్రబాబును మించిన నవరస నటనా సార్వభౌముడు మరొకరు లేరని తాజాగా తేటతెల్లమైంది.

Also Read: మరో చిచ్చు పెట్టిన నిమ్మగడ్డ రమేశ్

చంద్రబాబు తిరుపతి ఎయిర్ పోర్టులో బైటాయించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో చంద్రబాబు కలెక్టర్ ఎస్పీలకు వినతిపత్రాలు ఇస్తాననడం.. పోలీసులు ఆయనకు దండాలు పెట్టి ఇలాంటి డ్రామాలు ఆపండని అర్థం వచ్చేలా వేడుకోవడం మసాల అద్దినట్టైంది.

సాధారణంగా పోలీసులు ఇదే చంద్రబాబు తీరు పట్ల కఠినంగా.. దారుణంగా వ్యవహరించి లాక్కెళితే ఆయనకు మైలేజ్ వచ్చి జనం అయ్యో పాపం అంటారు. కానీ ఇక్కడ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. మీడియాను పోలీసులు అనుమతించకపోవడం.. కలెక్టర్ ఎస్పీలను కలువనీయకపోవడంతో ఇక లాభం లేదనుకొని చంద్రబాబు నిరసన దీక్ష వదిలేశాడు.

Also Read: కేటీఆర్ వర్సెస్ రాంచంద్రరావు.. పంచ్ ఇచ్చిన కేటీఆర్

చంద్రబాబు గారూ.. మీరు చేసిన రచ్చ చాలు లేవండి.. జర నిరసన బంద్ చేయండని పోలీసులే చేతులు జోడించి వేడుకోవడం చూశాక.. చంద్రబాబు ఆడిన ఆట అంతా బూడిదలో పోసిన పన్నీరైందని తాజాగా సెటైర్లు పడుతున్నాయి.

చంద్రబాబు పోలీసుల నుంచి చీత్కారం లభిస్తే దాన్ని క్యాష్ చేసుకుందామని చూశాడని.. కానీ పోలీసులే తెలివిగా చుట్టూ చేరి దండాలు పెట్టడం చూశాక ఇక లాభం లేదనుకొని తాజాగా 9 గంటల నిరసనను ఆపేసి హైదరాబాద్ బయలు దేరి వెళ్లిపోయాడట..

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ధర్నాకు దిగిన బాబు.. ఉలిపిక్కిపడ్డ Jagan: Chandrababu DHARNA At Renigunta Airport | Mahaa News Live