Bill Gates Meet Chandrababu: హైదరాబాద్( Hyderabad) ఐటి అభివృద్ధి వెనుక చంద్రబాబు పాత్ర ఉంది. దానిని రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు. నాడు విజన్ 20-20 పేరుతో చంద్రబాబు ఇచ్చిన నినాదం బాగానే వర్కౌట్ అయ్యింది. హైటెక్ సిటీ తో హైదరాబాదులో వేసిన పునాదులు నేడు మహావృక్షాలుగా మారాయి. ఆ రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక అభివృద్ధి ఫలాలను అందిస్తున్నాయి. నేడు నవ్యాంధ్రప్రదేశ్లో సైతం 2047 విజన్ తో ముందుకు వెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో వేస్తున్న అడుగులు ఏపీ భావితరానికి అభివృద్ధి ఫలాలను అందించనున్నాయి. అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు.. అమరావతికి బిల్ గేట్స్ రాకతో ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగారు చంద్రబాబు.
* విశాఖకు ఐటి సంస్థలు.. విశాఖ( Visakhapatnam) నగరాన్ని ఐటి హబ్ గా మార్చాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ దిగ్గజ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చేందుకు ఒప్పందం జరిగింది. దానికి భూమి కేటాయింపులతో పాటు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించే వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గూగుల్ డేటా సెంటర్ రాకతో అనుబంధ ఐటీ పరిశ్రమలు ఒక్కొక్కటి విశాఖకు వస్తోంది. స్టార్టాప్ కంపెనీల నుంచి దిగ్గజ ఐటీ సంస్థల వరకు విశాఖ వైపే చూస్తున్నాయి. రానున్న పది సంవత్సరాల్లో విశాఖలో భారీగా పరిశ్రమల ఏర్పాటు కావడం ఖాయం. ఇప్పుడు బిల్ గేట్స్ రావడంతో ప్రపంచంలోని ఐటీ సంస్థలు ఏపీ వైపు చూడడం ప్రారంభించాయి.
* టెక్ హబ్ గా అమరావతి..
అమరావతిలో క్వాంటం వ్యాలీ( Quantum Vyally )ఏర్పాటుతో పాటు టెక్ హబ్ గా మారబోతున్న ఈ తరుణంలో బిల్ గేట్స్ ఏపీ పర్యటన.. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి చాలా కీలకం కానుంది. భవిష్యత్తులో అమరావతిలో ఐటి అగ్రభాగాన ఉంచేందుకు బిల్ గేట్స్ పర్యటన దోహదపడునుంది. విశాఖ ఒకవైపు ఐటీ హబ్ గా ఉండనుంది. క్వాంటం వ్యాలీతో అమరావతి సైతం ఎంతో గుర్తింపు సాధించనుంది. ఇప్పుడిప్పుడే క్వాంటం కంప్యూటర్ల వినియోగం పెరుగుతోంది. దేశంలోనే ముందుగా అందిపుచ్చుకున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. వీలైనంత త్వరగా అభివృద్ధి ఫలాలను ఐటీ పరంగా అందించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రావడం శుభపరిణామం. ఐటీ పరంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నవారు సైతం ఇప్పుడు సన్నాహాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు సీనియారిటీ అక్కరకు వచ్చింది. కేవలం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం తోనే బిల్ గేట్స్ లాంటి దిగ్గజ ఐటి పారిశ్రామికవేత్త రావడం ఈ రాష్ట్రానికి శుభదాయకం. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.