Plants That Control Diabetes: డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేసే మొక్కలు ఇవే?

Plants That Control Diabetes: దేశంలో డయాబెటిస్ తో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో డయాబెటిస్ రోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. శరీరంలో ఇన్సులిన్ తక్కువగా విడుదలైతే డయాబెటిస్ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. మారుతున్న జీవనశైలి వల్ల కూడా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఊబకాయం, ఒత్తిడి వల్ల డయబెటిస్ బారిన పడేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒకసారి డయాబెటిస్ బారిన పడితే మందులతో సమస్యను నియంత్రించాల్సి […]

Written By: Navya, Updated On : September 1, 2021 11:01 am
Follow us on

Plants That Control Diabetes: దేశంలో డయాబెటిస్ తో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో డయాబెటిస్ రోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. శరీరంలో ఇన్సులిన్ తక్కువగా విడుదలైతే డయాబెటిస్ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. మారుతున్న జీవనశైలి వల్ల కూడా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఊబకాయం, ఒత్తిడి వల్ల డయబెటిస్ బారిన పడేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఒకసారి డయాబెటిస్ బారిన పడితే మందులతో సమస్యను నియంత్రించాల్సి వస్తుంది. అయితే కొన్ని మొక్కల సహాయంతో డయాబెటిస్ ను నియంత్రించుకోవచ్చు. డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే వాటిలో కలబంద మొక్క ఒకటి. కలబంద రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడంలో దివ్యౌషధంగా పని చేస్తుంది. షుగర్ లెవెల్స్ ను నియంత్రించే కొన్ని పదార్థాలు కలబంద మొక్కలో ఉన్నాయి.

ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నవాటిలో ఇన్సులిన్ ప్లాంట్ కూడా ఒకటి. ఇన్సులిన్ ప్లాంట్ మొక్క ఆకులు రుచికి పుల్లగా ఉంటాయి. ఈ ఆకులను తినడం ద్వారా రక్తంలోని షుగర్ లెవెల్స్ ను సులభంగా తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. డయాబెటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉండే మొక్కలలో స్టెవియా ప్లాంట్ కూడా ఒకటి. ఈ ఆకులను టీ, షర్బత్ లలో పొడిగా చేసి వాడుకోవచ్చు.

స్టెవియా ప్లాంట్ లో జీరో కేలరీలు ఉండటంతో పాటు చక్కెర లెవెల్స్ ను సులభంగా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో వేప ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. వేపలో యాంటీ-వైరల్ లక్షణాలతో పాటు గ్లైకోసైడ్స్ కూడా ఉంటాయి. రక్తంలోని గ్లూకోజ్ ను తగ్గించడంలో వేప ఆకులు ఎంతగానో తోడ్పడతాయి.