
తెలుగురాష్ట్రాల్లో నేతల కంటే కూడా మీడియా ఇప్పుడు స్ట్రాంగ్. అందుకే కేసీఆర్ తెలంగాణ సీఎం కాగానే మీడియాపై పడి రెండు బలమైన మీడియా శక్తులను అణిచివేశాడన్న టాక్ ఉంది. ఇప్పుడు ఏపీలోనూ సీఎం జగన్ కు బలమైన టీడీపీ మీడియా వెంటాడుతూనే ఉంది. దాన్నుంచి కాపాడుకునేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
Also Read: బీజేపీ వ్యూహాల వెనుక ‘టీవీ9’ మాజీ సీఈవో?
ఇలా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గవర్నర్ ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ఎప్పటివరకు అనేది నిర్ణయిస్తారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ అనుకూలమైన మీడియాను అసెంబ్లీలోకి అనుమతించి అధికార వైసీపీ లూప్ హోల్స్ వెతికే పనిలో టీడీపీ స్కెచ్ గీసింది.
ఇక వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో నిషేధించిన తెలుగు న్యూస్ చానెల్స్, పేపర్స్ ఏబీఎన్, టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకరులను, లైవ్ ను అనుమతించాలని ఎమ్మెల్సీలు కోరారు. చట్ట సభల్లో కూడా మీడియా విషయంలో ప్రభుత్వం వివక్షకు పాల్పడుతుందని.. సమావేశాలకు మీడియాను అనుమతించకపోవడం ఆర్టికల్ 19 ని ధిక్కరించడమే అన్నారు. మరి దీనికి అనుమతి వస్తుందా? రాదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Also Read: గ్రేటర్ బరి నుంచి జనసేన అందుకే తప్పుకుందా..?
తాజా అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాలను సిద్దం చేశారు. ముందుగా మండలి చైర్మన్ కు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖ రాశారు. సభ్యుల హక్కులను కాపాడాలని మండలి చైర్మన్ ను కోరారు. కోవిడ్ పేరుతో ప్రశ్నోత్తరాల సమయం లేకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. ప్రజా సమస్యలను లేవదీసి ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రశ్నోత్తరాల సమయానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ప్రతి పక్ష టీడీపీ వ్యూహాలు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ముందుగానే అలెర్ట్ అయ్యింది. మండలి చైర్మన్ కు టీడీపీ లేఖ రాసింది. రెండు కీలక అంశాలను ప్రస్తావించడం విశేషం.
ఏపీలోని బలమైన వైసీపీ, టీడీపీ మరో ఫైట్ కు అసెంబ్లీ వేదిక కానుంది. ఏపీ అసెంబ్లీ సాక్షిగా తలపడేందుకు కత్తులు నూరుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం సిద్ధం కావడంతో ఏపీలో హీట్ పెరిగింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Comments are closed.