PhonePe: ఫోన్ పే వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. అలా చేస్తే అదనపు ఛార్జీలు?

PhonePe: ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్స్ లో ఫోన్ పే కూడా ఒకటనే సంగతి తెలిసిందే. దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల కొరకు ఫోన్ పే యాప్ ను వినియోగిస్తున్నారు. ప్రధానంగా బిల్లుల చెల్లింపు మనీ ట్రాన్స్ ఫర్ కొరకు ఫోన్ పే యాప్ ను వినియోగించడం జరుగుతుంది. పట్టణాల నుంచి పల్లెల వరకు ఫోన్ పే యాప్ వినియోగించే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. క్రెడిట్ కార్డ్ యూజర్లు క్రెడిట్ కార్డ్ […]

Written By: Kusuma Aggunna, Updated On : September 21, 2021 10:00 am
Follow us on

PhonePe: ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్స్ లో ఫోన్ పే కూడా ఒకటనే సంగతి తెలిసిందే. దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల కొరకు ఫోన్ పే యాప్ ను వినియోగిస్తున్నారు. ప్రధానంగా బిల్లుల చెల్లింపు మనీ ట్రాన్స్ ఫర్ కొరకు ఫోన్ పే యాప్ ను వినియోగించడం జరుగుతుంది. పట్టణాల నుంచి పల్లెల వరకు ఫోన్ పే యాప్ వినియోగించే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. క్రెడిట్ కార్డ్ యూజర్లు క్రెడిట్ కార్డ్ నుంచి ఫోన్ పే వాలెట్ కు డబ్బులను యాడ్ చేసుకుంటూ ఉంటారు.

అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్ పే వాలెట్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకునే వాళ్లకు భారీ షాక్ తగలనుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు వేసుకుంటే 100 రూపాయలకు ఏకంగా 2.06 రూపాయలు ఛార్జీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువమొత్తం యాడ్ చేసుకుంటే అంత ఎక్కువ మొత్తం ఛార్జీలు సైతం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఫోన్ పే యాప్ ను వినియోగించే వాళ్లకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

అడిషనల్ కన్వీనియన్స్ ఫీజుగా ఫోన్ పే కంపెనీ ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఎవరైతే క్రెడిట్ కార్డ్ ద్వారా వాలెట్ లో డబ్బులు యాడ్ చేసుకుంటారో వాళ్లు మాత్రమే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా డెబిట్ కార్డ్ ద్వారా, ఇతర విధానాల ద్వారా డబ్బులు యాడ్ చేసుకుంటే మాత్రం ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫోన్ పే యాప్ ను వినియోగించే వాళ్లు క్యాష్ బ్యాక్ ల ద్వారా డబ్బులను పొందే అవకాశం కూడా ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫోన్ పే యాప్ ను వినియోగించే వాళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.