
పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. ఆయన వాయిస్ లో ఒక తెలియని గరుకుతనం. అలాంటి పవన్ కోర్టులో వాదిస్తుంటే అభిమానులకు గూస్ బాంబ్స్ ఖాయం. తాజాగా రిలీజ్ అయిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ లో పవన్ వాదించిన తీరుకు ఈలలు పడిపోతున్నాయి.. నల్లకోటు వేసుకున్న ఒక బెబ్బులిలా పవన్ కనిపిస్తున్నాడు. ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ తో వాదించిన తీరు నబూతో నభవిష్యతి అన్నట్టుగా ఉంది.
ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు. దక్షిణాదిలోనే మేటి నటుడు ‘ప్రకాశ్ రాజ్’. వీరిద్దరూ కోర్టు హాల్ లో కొదమ సింహాల్లో తలపడ్డ తీరు చూస్తే సినిమా ఖచ్చితంగా బంపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
‘నువ్వు వర్జిన్’ వా అని ప్రకాష్ రాజు హీరోయిన్ ను అడగడం.. దానికి కౌంటర్ గా పవన్ ‘విలన్ పాత్రధారి’ని అడగడం చూస్తుంటే కోర్టు హాల్ సీన్స్ దుమ్ము దులిపేసేలా కనిపిస్తున్నాయి.
‘మీరైతే అమ్మాయిలను అడగవచ్చు.. మేం అయితే అబ్బాయిలను అడగకూడదా?’ ఏం న్యాయం నందాజీ ఇది కూర్చొండి అని ప్రకాష్ రాజును వెటకారంగా పవన్ అన్న డైలాగ్ వింటే గూస్ బాంబ్స్ రావడం ఖాయం.
వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో శ్రీరాం వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ అంచనాలు పెంచేలా ఉంది.
మరి ఎందుకు ఆలస్యం ఆ టీజర్ ను మీరూ చూసేయండి..