పంచాయతీ ఫెయిల్: ఆ మంత్రులు ఔట్ యేనా?

ఏపీలో మొత్తానికి పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓవరాల్ గా అధికార వైసీపీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే కొన్ని చోట్ల మాత్రం అనుకున్న సీట్లు రాలేదు. ఈ ఎన్నికలకు ముందే జగన్ కొందరు మంత్రులకు తమ నియోజకవర్గాల్లో బాధ్యతలను అప్పగించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయాలని నిర్దేశించారు. అయితే ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా సీఎం జగన్ ఏయే మంత్రులు పార్టీ కోసం పనిచేశారు..? అనే సమాచారాన్ని తెప్పించుకున్నాడట. వీరిలో ఎక్కువ […]

Written By: NARESH, Updated On : February 23, 2021 6:19 pm
Follow us on

ఏపీలో మొత్తానికి పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓవరాల్ గా అధికార వైసీపీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే కొన్ని చోట్ల మాత్రం అనుకున్న సీట్లు రాలేదు. ఈ ఎన్నికలకు ముందే జగన్ కొందరు మంత్రులకు తమ నియోజకవర్గాల్లో బాధ్యతలను అప్పగించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయాలని నిర్దేశించారు. అయితే ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా సీఎం జగన్ ఏయే మంత్రులు పార్టీ కోసం పనిచేశారు..? అనే సమాచారాన్ని తెప్పించుకున్నాడట. వీరిలో ఎక్కువ మంది పనితీరును మెచ్చుకున్నారట. అయితే ఓ నలుగురు మంత్రులు మాత్రం పార్టీని పట్టించుకోలేదట.

Also Read: జగన్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

సీఎం జగన్ కేబినెట్ లో 25 మంది మంత్రులున్నారు. వారిలో అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని, వల్లంపల్లి శ్రీనివాస్, బాబినేని శ్రీనివాసరెడ్డి, అమ్జద్ పాషా మంత్రుల నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. దీంతో వీరిని మినహాయిస్తే మిగతా మంత్రుల నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు ఎలా పనిచేశారన్నది సీఎం జగన్ స్టడీ చేస్తున్నాడట.

ముందుగా సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలో 108 స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ సాధించింది. 19 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా మిగిలినవన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఇక మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన పుంగనూనులో 85 పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన ఏకగ్రీవం చేసుకున్నారు. ఒక్కచోటా ఎన్నిక జరగలేదు.

మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గంలో 119 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా వీటిలో వైసీపీ 88 స్థానాలను దక్కించుకుంది.మిగతావి టీడీపీ చేజిక్కించుకుంది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో 83 స్థానాలను వైసీపీ గెలుచుకుంది.

విజయనగరం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తన నియోజకవర్గం కురుపాండ్ లో 101 పంచాయతీ స్థానాలను గెలిపించారు. ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆసుపత్రిలో ఉన్నాసరే వైసీపీ జెండా ఎగురవేయించింది. ఇక్కడ టీడీపీకి 21 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నియోజకవర్గం జీడీ నెల్లూరులో 137 పంచాయతీల్లో 117 స్థానాల్లో వైసీపీని గెలిపించారు. మిగతా 17 టీడీపీ, మిగిలినవి ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.

Also Read: గ్రేటర్ వాసులకు జలమండలి ‘జల’క్‌

ఇదిలా ఉండగా నలుగురు మంత్రుల నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ తక్కువ పంచాయతీలను గెలుచుకుంది. వారిలో గుమ్మనూరు జయరాం, విశ్వరూప్, మేకతోటి సుచరిత, కొడాలి నానిల నియోజకవర్గాల్లో మిగిలిన అందరితో పోలిస్తే తక్కువ పంచాయతీలు గెలుచుకున్నారు.

మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిథ్యం వహిస్తున్న కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో 108 పంచాయతీలకు వైసీపి 78, టీడీపీ 27, ఇతరులు 3 స్థానాలను గెలిచారు. కృష్ణ జిల్లాలోని గుడివాడ నుంచి మంత్రిగా ఉన్న కొడాలి నాని నియోజకవర్గంలో 88 పంచాయతీలకు ఎన్నికలు జరగగా అందులో 37 వైసీపీ, 14 టీడీపీ మిగతావి ఇతరులకు దక్కాయి.

గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాటి నియోజకవర్గం నుంచి ప్రాతినిత్యం వహిస్తున్న మేకతోటి సుచరిత నియోజకవర్గంలో వైసీపీ 38 స్థానాల్లో గెలిచింది. టీడీపీ 17, ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవిశ్వరూప్ తన నియోజకవర్గంలో 60 పంచాయతీలకు గాను వైసీపీ 36, టీడీపీ 11, జనసేనతో కలిపి ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఈ మంత్రులపై సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఆసక్తి నెలకొంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్