https://oktelugu.com/

ఓటీటీ వర్సెస్ మల్టీప్లెక్స్.. నిర్మాతలకు షాక్..!

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో సినిమా థియేటర్లు మూతపడగా.. షూటింగులు వాయిదా వేయాల్సి వచ్చింది. కొన్నినెలల క్రితమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి ఇచ్చాయి. అయితే చాలా ఆలస్యంగా థియేటర్లకు ఓపెనింగ్ కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. దాదాపు ఏడునెలల అనంతరం తిరిగి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. Also Read: చాన్నాళ్లకు సీనియర్ కమెడియన్ కి ఛాన్స్ ! కరోనా నిబంధనలు పాటిస్తూ 50శాతం అక్యుపెన్సీతో థియేటర్లు నేటి నుంచి ఓపెన్ కాబోతున్నాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 10:44 am
    Follow us on

    దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో సినిమా థియేటర్లు మూతపడగా.. షూటింగులు వాయిదా వేయాల్సి వచ్చింది. కొన్నినెలల క్రితమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి ఇచ్చాయి. అయితే చాలా ఆలస్యంగా థియేటర్లకు ఓపెనింగ్ కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. దాదాపు ఏడునెలల అనంతరం తిరిగి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి.

    Also Read: చాన్నాళ్లకు సీనియర్ కమెడియన్ కి ఛాన్స్ !

    కరోనా నిబంధనలు పాటిస్తూ 50శాతం అక్యుపెన్సీతో థియేటర్లు నేటి నుంచి ఓపెన్ కాబోతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా 10వేలకు పైగా స్క్రీన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో సగం మల్టిపెక్స్ కాగా.. మరోసగం సింగిల్ స్క్రీన్ థియేటర్లు. కరోనా టైంలో నిర్మాతలు ఓటీటీల్లో సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో మల్టిపెక్స్ యాజమాన్యాలు ఓటీటీల్లో కొత్త సినిమాలను విడుదల చేయద్దని కోరాయి. అయితే దీనిని నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు.

    తాజాగా థియేటర్లు తెరుచుకుంటుండటంతో ఇప్పుడు వాటి యజమానులకు ఆ ఛాన్స్ వచ్చింది. తాము గతంలో ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేయద్దని హెచ్చరించినా కొందరు నిర్మాతలు విన్పించుకోకపోవడంపై థియేటర్ యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయిన సినిమాలేవి కూడా మల్లిపెక్స్ ల్లో ప్రదర్శించకుండా బ్యాన్ విధించి అందరికీ షాకిచ్చాయి.

    లాక్డౌన్ సమయంలో దిల్ బెచారా.. శకుంతలా దేవి.. సడక్-2.. గుంజన్ సక్సేనా తదితర సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సినిమాలను థియేటర్లలో కూడా విడుదల చేసేందుకు ముందస్తుగానే వారు ఒప్పందం చేసుకున్నారు.ఈ సినిమాల థియేటర్ రిలీజ్ కు ఓటీటీలు ఓకే చెబుతున్నాయి. అయితే మల్టీప్లెక్స్ లు మాత్రం వీటిని ప్రదర్శించేది లేదని తెగేసి చెబుతున్నాయి.

    Also Read: పాపం.. అందాల ‘నిధి’కి అవకాశాలు లేక.. !

    కొత్త సినిమాలు లేకుంటే ఖాళీగా అయినా ఉంచేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం మల్లిపెక్స్ లకు నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే మల్లిపెక్స్ మాత్రం తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఓటీటీల్లో విడుదలైన సినిమాలు థియేటర్లలో రాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.