దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నెల 15వ తేదీన ఓలా స్కూటర్ రిలీజ్ కాగా తాజాగా మరో సంస్థ కూడా ఓలా స్కూటర్ ను రిలీజ్ చేయడం గమనార్హం. బెంగళూరు కంపెనీలలో ఒకటైన సింపుల్ వన్ సంస్థ రిలీజ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 1,10,000 రూపాయలు కావడం గమనార్హం. రూ. 1,947 చెల్లించి ఈ స్కూటర్ ను బుకింగ్ చేసుకోవచ్చు.
సింపుల్ వన్ సంస్థ తమిళనాడులోని హోసూర్‌లోని ప్లాంట్ లో ఈ స్కూటర్లను తయారు చేస్తోంది. ఈ ప్లాంట్ ఒక సంవత్సరానికి ఏకంగా మిలియన్ స్కూటర్లను ఉత్పత్తి చేయగలదని తెలుస్తోంది. తమిళనాడు, ఢిల్లీ, గోవా, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకలలో మొదట ఈ స్కూటర్ అందుబాటులోకి వస్తోంది. 4.8 kwh పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో ఈ స్కూటర్ తయారైంది. ఆరు కిలోగ్రాముల బరువుతో ఈ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ పబ్లిక్ ప్లేస్‌లలో ఫాస్ట్ ఛార్జర్‌లను కూడా ఇన్ స్టాల్ చేయనుంది.
సింగిల్ ఛార్జ్‌లో ఏకో మోడ్‌లో 203 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉండి. గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉండటంతో పాటు మిడ్ డ్రైవ్ మోటార్‌పై ఆధారపడి పని చేస్తుంది. డాక్యుమెంట్ స్టోరేజ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇతర ఫీచర్లను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కలిగి ఉంది.
ఎరుపు, తెలుపు, నలుపు, నీలం రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కానుంది. ఏథర్, హీరో ఎలక్ట్రిక్, ఒకినావా స్కూటర్లకు ఈ స్కూటర్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.