నటుడిగా కాదు.. ప్రమాద బాధితుడిగా వచ్చాను: ఎన్టీఆర్ ఎమోషనల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఈ అగ్రహీరో పోలీసులు నిర్వహించిన భద్రతా వారోత్సవాల్లో పాల్గొని తాను ఒక బాధితుడినే అని వాపోయారు. స్వయంగా రోడ్డు ప్రమాదానికి తాను గురయ్యానని.. తన అన్న నందమూరి జానకీ రామ్, నాన్న హరికృష్ణ ఇదే రోడ్డు ప్రమాదాల్లో మరణించారని గుర్తు చేసుకున్నారు. వారి లేని లోటు పూడ్చలేనిది అని.. వారిలో ఎవరూ కాకూడదనే తాను ఈ కార్యక్రమానికి వచ్చి ఉపదేశం ఇస్తున్నానని ఎన్టీఆర్ అన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ వార్సిక సమావేశంలో […]

Written By: NARESH, Updated On : February 18, 2021 12:03 pm
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఈ అగ్రహీరో పోలీసులు నిర్వహించిన భద్రతా వారోత్సవాల్లో పాల్గొని తాను ఒక బాధితుడినే అని వాపోయారు. స్వయంగా రోడ్డు ప్రమాదానికి తాను గురయ్యానని.. తన అన్న నందమూరి జానకీ రామ్, నాన్న హరికృష్ణ ఇదే రోడ్డు ప్రమాదాల్లో మరణించారని గుర్తు చేసుకున్నారు. వారి లేని లోటు పూడ్చలేనిది అని.. వారిలో ఎవరూ కాకూడదనే తాను ఈ కార్యక్రమానికి వచ్చి ఉపదేశం ఇస్తున్నానని ఎన్టీఆర్ అన్నారు.

సైబరాబాద్ ట్రాఫిక్ వార్సిక సమావేశంలో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మా తాత ఎన్టీఆర్ వెంట 33 వేల కిలోమీటర్లు బస్సు నడిపిన ఆయనను జాగ్రత్తగా తీసుకొచ్చిన మా తండ్రి హరికృష్ణ ఎవరో చేసిన తప్పుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతి జాగ్రత్తపరుడైన మా అన్నయ్య జానకీరామ్ సైతం ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.

తాను ఈ సమావేశానికి ఒక నటుడిగా రాలేదని.. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితుడిగా వచ్చానని ఎన్టీఆర్ తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ , రోడ్డు సూచనలు పాటించడం సర్వోత్తమమైన విషయం అని పేర్కొన్నారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎన్టీఆర్ పరిశీలించారు. రక్షణాత్మక పరికరాల గురించి అడిగి తెలుసున్నారు. పౌరులంతా మిమ్మల్ని మీరు మార్చుకోండని.. బాధ్యతతో వ్యవహరించి కుటుంబ సభ్యుల కోసం మీరు మారి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఎన్టీఆర్ అన్నారు.