https://oktelugu.com/

అఖిల్-మోనాల్ బయట కూడా వదలట్లేదుగా?

బిగ్ బాస్ ముగిసినా ఆ బంధాలు.. అనుబంధాలు మాత్రం ఇంకా బయట కూడా కొనసాగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ కి హౌస్ లో మైలేజ్ ఇచ్చిన అంశం అఖిల్ తో లవ్ ఎఫైర్. బిగ్ బాస్ సీజన్ 4కి గానూ బెస్ట్ లవ్ పెయిర్ గా వీరిద్దరూ నిలిచారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేమన్నట్లు హౌస్ లో మెలిగారు. హౌస్ లో ఎక్కువ సమయం వీరిద్దరు మాత్రమే కలిసి గడిపేవారు. ఇక ముద్దులు, హగ్గులు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 13, 2021 / 08:42 PM IST
    Follow us on

    బిగ్ బాస్ ముగిసినా ఆ బంధాలు.. అనుబంధాలు మాత్రం ఇంకా బయట కూడా కొనసాగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ కి హౌస్ లో మైలేజ్ ఇచ్చిన అంశం అఖిల్ తో లవ్ ఎఫైర్. బిగ్ బాస్ సీజన్ 4కి గానూ బెస్ట్ లవ్ పెయిర్ గా వీరిద్దరూ నిలిచారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేమన్నట్లు హౌస్ లో మెలిగారు. హౌస్ లో ఎక్కువ సమయం వీరిద్దరు మాత్రమే కలిసి గడిపేవారు. ఇక ముద్దులు, హగ్గులు చాలా కామన్ గా జరిగేవి.

    Also Read: నేరాలకు పాల్పడటం సోనూసూద్ కు అలవాటు !

    ఓ సందర్భంలో అఖిల్ మోనాల్ ని నామినేట్ చేయగా… అఖిల్ నా ఫ్యామిలీలా ఫీలయ్యాను, నన్నే నామినేట్ చేస్తే తట్టుకోలేకపోయానని మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కథ అలా ఉంచితే హౌస్ నుండి బయటికి వచ్చిన తరువాత కూడా మోనాల్-అఖిల్ లు సన్నిహితంగానే ఉంటున్నారని సమాచారం. అలాగే మోనాల్ ఇంకా హైదరాబాద్ లోనే ఉండడంతో వీరి ప్రేమ, ఫ్రెండ్ షిప్ లు కొనసాగుతూనే ఉన్నాయి.

    బిగ్ బస్ నుంచి బయటకు వచ్చాక కూడా మోనాల్-అఖిల్ ప్రేమ బంధం.. వీరిద్దరితో సోహైల్ స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే న్యూ ఇయర్ ను కలిసి జరుపుకున్న వీరు.. తాజాగా మరోసారి ప్రేమను చాటుకున్నారు.

    Also Read: మరో బయోపిక్.. ఆయన కాబట్టే ఒప్పుకుందట !

    అఖిల్ , సోహైల్ ఇద్దరూ తాజాగా ఎర్ర గులాబీ పూలను మోనాల్ కు ఇస్తూ ఫోటోలకు ఫోజిచ్చారు. దీనికి నవ్వుతున్న మోనాల్ ఫొటో వైరల్ గా మారింది. ఈ ముగ్గురు రోమాంటిక్ గా దిగిన ఫోటోలు ఇప్పుడు అందరికీ హాట్ హాట్ గా మారాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్