ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సుప్రీంకోర్టులో దిమ్మదిరిగి బొమ్మ కనపడడం ఖాయమన్న చర్చ ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. తాజాగా ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించవచ్చని ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగానే నిమ్మగడ్డ పండుగ చేసుకొని ఎన్నికలకు నిర్వహణకు రెడీ అయ్యారు.
Also Read: ఎన్నికల కమిషనర్ వర్సెస్ ఏపీ సర్కారు ఉద్యోగులు
కానీ ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ఆశలపై నీళ్లు చల్లుతూ సుప్రీంకోర్టుకు ఎక్కింది. సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది. అయితే కొన్ని తప్పులు ఉన్నాయని మళ్లీ పిటీషన్ వేయాలని సుప్రీంకోర్టు కోరింది.
అయితే సుప్రీంకోర్టులో షాక్ తగిలిందని డిసైడ్ అయిన నిమ్మగడ్డ రేపు ఏపీలో ప్రెస్ మీట్ పెట్టి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట.. కానీ ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్టు అక్కడ జగన్ ఉన్నది జగన్ సర్కార్. నిమ్మగడ్డ ప్రకటన ఇచ్చినా నిర్వహించే బాధ్యత ఏపీ ప్రభుత్వానిది.. ఉద్యోగులదీ.. కానీ వారి ఇద్దరూ సుప్రీంకోర్టుకు ఎక్కి ఎన్నికలు నిర్వహించమని భీష్మించుకు కూర్చున్నారు.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులోనూ వాదనలు కొనసాగనున్నాయి. అక్కడ జగన్ సర్కార్ వాదనకు బలం చేకూరేలా నిర్ణయం వెలువడబోతోందని.. ఖచ్చితంగా నిమ్మగడ్డకు షాక్ తప్పదన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే జగన్ అప్పట్లో రాసిన లేఖతో న్యాయవ్యవస్థనే మొత్తంగా షేక్ అయ్యింది. అందులో వాస్తవాలను గుర్తించి ఈ మధ్య కాస్త అనుకూల వాతావరణం నెలకొంది. మరోసారి నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు రావడం.. సుప్రీంకోర్టుకు ఎక్కడంతో అక్కడ కూడా సీఎం జగన్ కు అనుకూలంగా తీర్పు రాబోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి విరుద్ధంగా వెళుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డకు షాక్ తప్పదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
Also Read: జనసేన వర్సెస్ బీజేపీ.. తిరుపతి ఎవరిది?
సుప్రీంకోర్టులో ఇప్పటికే జగన్ సర్కార్ మరోసారి అత్యవసర పిటీషన్ వేసింది. ఈరోజే రిజిస్ట్రీ పిటీషన్ ను సరిచేసి దాఖలు చేయవచ్చని వైసీపీ లాయర్లు చెబుతున్నారు. శనివారం నాడే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేయాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది.
స్థానిక ఎన్నికలు ఏపీలో నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు తలుపు తట్టింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ పిటీషన్ గందరగోళంగా ఉందని సుప్రీంకోర్టు తిప్పిపంపినట్టు తెలిసింది.
అత్యవసర పిటీషన్ కింద విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం మెన్షన్ చేసింది. అయితే కోర్టు సమయం ముగియడంతో ఏపీ సర్కార్ సందిగ్ధంలో పడింది.సుప్రీంకోర్టులో పిటీషన్ సందిగ్ధంలో పడడంతో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ దూకుడు పెంచారు. శనివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు రెడీ అయ్యారు. ఎన్నికలకు జగన్ సర్కార్ వ్యతిరేకంగా ఉండడంతో దీనిపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్