https://oktelugu.com/

ఒంటరైన దేవినేని.. వైసీపీతో ఫైట్ కు కలిసిరాని నేతలు?

నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో దేవినేని కుటుంబం హవా అంతా ఇంతాకాదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా దేవినేని కుటుంబానికి ఎదురులేకుండా పోయేది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దేవినేని ఉమ తన సొంత జిల్లాకు సీఎంగా ఉండేవారనే ప్రచారం జోరుగా సాగేది. జిల్లా రాజకీయాలపై కూడా ఉమాకు అదేస్థాయి పట్టు ఉండేది. Also Read: నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ కాగా.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉమా వ్యవహార శైలి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 22, 2021 / 06:42 PM IST
    Follow us on

    నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో దేవినేని కుటుంబం హవా అంతా ఇంతాకాదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా దేవినేని కుటుంబానికి ఎదురులేకుండా పోయేది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దేవినేని ఉమ తన సొంత జిల్లాకు సీఎంగా ఉండేవారనే ప్రచారం జోరుగా సాగేది. జిల్లా రాజకీయాలపై కూడా ఉమాకు అదేస్థాయి పట్టు ఉండేది.

    Also Read: నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ

    కాగా.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉమా వ్యవహార శైలి కారణంగా అతడికి అనుచరులుగా ఉన్నవారు ఒక్కొక్కరిగా దూరం అయ్యారు. విజయవాడలో సైతం అతడికి మద్దతు కరువైందని చెప్పవచ్చు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒకప్పుడు ఏకపక్ష రాజకీయాలు నడిపిన దేవినేని ఉమ ఇప్పుడు సొంత నియోజకవర్గంలో ఇమడలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో సొంత సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొడాలి నానితో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో ఒంటరివాడైనట్లు మాత్రం కనిపిస్తోంది.

    కృష్ణా జిల్లాలో టీడీపీకి దశాబ్దాలుగా వెన్నుమఖగా ఉన్న రాజకీయ కుటుంబాల్లో దేవినేని కుటుంబం ఒకటి. ఒకప్పుడు దేవినేని నెహ్రూ , వెంకటరమణ, తరువాత దేవినేని ఉమ .. ఇలా రాజకీయాలలో వారి కుటుంబాల హవా కొనసాగింది. నెహ్రూ పార్టీలు మారినా.. వెంకట రమణ, ఉమ సోదరులు టీడీపీలోనే ఉండిపోయారు. మంత్రిగా ఉన్న వెంకటరమణ ఆకస్మిక మరణం తరువాత టీడీపీలో చక్రం తిప్పడం మొదలు పెట్టిన దేవినేని ఉమా స్థాన బలమున్న జిల్లాలో నేతలందరినీ.. ఒకతాటిపైకి తీసుకొచ్చారు. ఇలా 2014లో టీడీపీనుంచి విజయం సాధించారు.

    2014 ఎన్నికల విజయం తరువాత చంద్రబాబు కేబినెట్లో తొలిసారి చోటు దక్కించుకున్న దేవినేని ఉమ అనంతరం తన హవా పెరుగుతుందని ఆశించారు. జిల్లాలో ఎప్పటినుంచో తనకు మద్దతుగా ఉన్న రాజకీయ కుటుంబాలతో పాటు మీడియాను దూరం చేసుకున్నారు. మంత్రిగా ఉంటూ.. జిల్లాలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలతో ఆయనకు ఎప్పటినుంచో మద్దతుగా ఉన్న నేతలంతా ఒక్కొక్కరిగా దూరం అవడం ప్రారంభించారు. చివరికి అతడి సొంత నియోజకవర్గం మైలవరంలోనూ నేతలు వైసీపీలోకి జంప్ అయిన పరిస్థితి. ఫలితంగా మంత్రిగా.. సీనియర్ నేతగా కొనసాగిన ఉమ .. ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు.

    Also Read: ఎన్నికల కమిషనర్ వర్సెస్ ఏపీ సర్కారు ఉద్యోగులు

    సొంత నియోజకవర్గం నేత, ఒకప్పటి పార్టీ సహచరుడు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న కొడాలి నానితో రాజకీయ పోరాటానికి సిద్ధమయాయరు దేవినేని. వరుసగా నానిని టార్గెట్ చేస్తూ.. పార్టీతో పాటు జిల్లాలో కోల్పోయిన పట్టును తిరిగి పొందాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే నానితో పోరాటంలో అతడితో కలిసివచ్చే వారే లేకుండా పోయారు. కొందరు నేతలు మినహా.. అందరూ ఉమాకు దూరం అయ్యరు. కోడాలి నానితో సై అంటే సై అంటూ అరెస్టుల వరకు వెళ్లిన దేవినేని ఉమాకు పార్టీ నేతల నుంచి మద్దతు లభించడం లేదనేది స్పష్టంగా అర్థం అవుతోంది.

    కాగా గత వైభవాన్ని తిరిగి పొందేందుకు ఉమా.. తన దగ్గరి వాళ్లకు ఫోన్లు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తననుంచి దూరం అయిన వాళ్లందరికీ.. ఫోన్ చేసి మద్దతు కోసం అభ్యర్థిస్తున్నారు. గతంలో జరిగిన తప్పిదాలను మళ్లీ చేయకుండా ఉంటానంటూ.. స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అయినా ఇంకా పలువురు సీనియర్ నేతలు తనతో కలిసి నడిచేందుకు ఇష్టంగా లేరనేది అర్థం అవుతోంది. దీంతో ఉమా టీడీపీని వీడుతారా..? అధికార పార్టీలో చేరుతారా..? అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్