కరోనా వైరస్ కు తోడు కొత్త కరోనా ప్రపంచాన్ని సవాల్ విసురుతోంది. చైనాలో కరోనా వైరస్ సోకగా అక్కడి నుంచి ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. అదేవిధంగా బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కొత్త వైరస్ కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన రేపుతోంది.
Also Read: కమలంతో పొత్తుకు చంద్రబాబు ఆరాటం
కరోనా మహమ్మరి ప్రపంచానికి నేర్పిన గుణపాఠంతో ఇప్పటికే అన్ని దేశాలు అప్రమమవుతున్నాయి. యూకే.. దక్షిణాఫ్రికాల్లోని విమాన ప్రయాణాలు.. రాకపోకలపై అన్నిదేశాలు ఆంక్షలు విధించాయి.
మరోవైపు కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదవుతున్న దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇక భారత్ సైతం కరోనా కొత్త స్ట్రెయిన్ పట్ల అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ తగు సూచనలు చేస్తోంది.
యూకే నుంచి గత నెలరోజులుగా భారత్ వచ్చిన వారి వివరాలను సేకరించింది. మొత్తం 33వేల మంది ప్రయాణీకులు యూకే నుంచి వచ్చినట్లు తేలగా వీరిందరికీ కరోనా టెస్టులను నిర్వహించారు. వీరిలో 114మంది కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం..!
వీరిలో యూకేకు చెందిన కరోనా కొత్త స్ట్రెయిన్ ఎంతమందికి వచ్చిందో తెలుసుకునేందుకు దేశంలోని ఆరు ల్యాబొరేటరీలకు ఈ జీనోమ్ సీక్వెన్సీకి పంపించారు. అక్కడ పలు టెస్టుల్లో ఆరుగురికి యూకే కొత్త వైరస్ సోకినట్లు గుర్తించారు.
ఈ ఆరుగురికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపిన కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రతమత్తం చేస్తోంది. ఈ ఆరు కేసుల్లో బెంగళూరులో మూడు.. హైదరాబాద్లో రెండు.. పూణే ఒకటిగా నమోదైందని సమాచారం.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్