ఏపీకి కొత్త సీఎం.. ‘ఆర్ఆర్ఆర్’ సంచలన కామెంట్స్..! 

నర్సాపురం ఎంపీ, వైఎస్సాఆర్ సీపీ రెబల్ నేత రఘురామ కృష్ణంరాజు(ఆర్ఆర్ఆర్) మరోసారి సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈనెల 16న సీఎం జగన్ భవితవ్యం .. ఏపీకి కొత్త సీఎం ఎవరనేది తేలనుందంటూ జోస్యం చెప్పారు. ‘రాజధాని రచ్చబండ’ కార్యక్రమంలో తాజాగా పాల్గొన్న ‘ఆర్ఆర్ఆర్’ ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. Also Read: కొత్త జిల్లాలు.. ఏపీలో పెనుమార్పులు ఇవీ! అక్టోబర్ 6న సీఎం జగన్ ఏపీ హైకోర్టులోని […]

Written By: NARESH, Updated On : November 15, 2020 5:53 pm
Follow us on

నర్సాపురం ఎంపీ, వైఎస్సాఆర్ సీపీ రెబల్ నేత రఘురామ కృష్ణంరాజు(ఆర్ఆర్ఆర్) మరోసారి సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈనెల 16న సీఎం జగన్ భవితవ్యం .. ఏపీకి కొత్త సీఎం ఎవరనేది తేలనుందంటూ జోస్యం చెప్పారు. ‘రాజధాని రచ్చబండ’ కార్యక్రమంలో తాజాగా పాల్గొన్న ‘ఆర్ఆర్ఆర్’ ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.

Also Read: కొత్త జిల్లాలు.. ఏపీలో పెనుమార్పులు ఇవీ!

అక్టోబర్ 6న సీఎం జగన్ ఏపీ హైకోర్టులోని ఐదుగురు జడ్జిలు.. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణలపై ఓ లేఖ విడుదల చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దీని ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలైందని తెలిపారు. ప్రముఖ లాయర్లు అశ్వనీ కుమార్.. సునీల్ కుమార్ లు సీఎం జగన్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారం నేరంగా పరిగణించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.

నవంబర్ 16 నుంచి సుప్రీం కోర్టులో దీనిపై విచారణ జరుగనుందని ‘ఆర్ఆర్ఆర్’ తెలిపారు. ఈ వ్యవహారంలో జగన్ కు ముందుగా సుప్రీం నోటీసులు జారీ చేస్తుందని తెలిపారు. జగన్ చేసేంది ముమ్మాటికి కోర్టు ధిక్కారణ కావడంతో వైసీపీలో టెన్షన్ మొదలైందన్నారు. జగన్ కు ఇప్పుడు రెండే దార్లు ఉన్నాయని తెలిపారు.

Also Read: సీఎం జగన్ ఆ సీనియర్ మంత్రిని దూరం పెడుతున్నారా?

సీఎం జగన్ తన తప్పును తెలుసుకొని కోర్టుకు క్షమాపణలు కోరడం లేదా ముఖ్యమంత్రి పదవీ రాజీనామా చేసి వేరే వ్యక్తిని ఆ సీట్లో కూర్చోపెట్టడమే శరణ్యమని తెలిపారు. గతంలో సంజీవరెడ్డి.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు సీఎంలుగా ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగిందని ఆయన గుర్తు చేశాడు.

జగన్ ఇప్పటికైనా తనకు తప్పుడు సలహాలు ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్న వారిని పక్కన పెట్టాలని రఘురామ సూచించాడు. ఇక విజయసాయిరెడ్డిపై కూడా రఘురామ ఫైర్ అయ్యాడు. ఇటీవల విజయసాయి విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ పరిపాలనా రాజధాని విశాఖపట్నంకు రాబోతోందని చెప్పారని గుర్తుచేశాడు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

హైకోర్టులో విచారణలో ఉన్న అంశంపై విజయసాయి ఎలా ప్రకటనలు చేస్తాడని మండిపడ్డాడు. ఆయనపై కూడా ఎవరో ఒకరు కేసు వేస్తారని అప్పుడు సాయిరెడ్డికి చుక్కలు కన్పిస్తాయని విమర్శించాడు. ఏదిఏమైనా ఏపీకి కొత్త సీఎం వస్తారని ‘ఆర్ఆర్ఆర్’ జోస్యం చెప్పడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రేపటిలోగా మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది.