బీటెక్ అర్హతతో 35 ఉద్యోగాలు.. రూ.1,40,000 వేతనంతో..?

ప్రముఖ కంపెనీలలో ఒకటైన నేషనల్ బిల్డింగ్స్ కన్స్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు విభాగాల్లో ఖాళీలుగా ఉన్న 35 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుండగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.nbccindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. Also Read: సెప్టెంబర్‌‌లో కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌..! ఈ ఉద్యోగాలకు […]

Written By: Kusuma Aggunna, Updated On : March 20, 2021 1:07 pm
Follow us on

ప్రముఖ కంపెనీలలో ఒకటైన నేషనల్ బిల్డింగ్స్ కన్స్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు విభాగాల్లో ఖాళీలుగా ఉన్న 35 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుండగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.nbccindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Also Read: సెప్టెంబర్‌‌లో కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌..!

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు వేతనంగా లభిస్తుంది. మొత్తం ఉద్యోగాలలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) ఉద్యోగ ఖాళీలు 25 ఉండగా మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌) ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 21 నాటికి గరిష్టంగా 29 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ వేతనంతో 1809 ఉద్యోగాలు..?

ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవాళ్లు కనీసం 60 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం మార్చి 22వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం ఏప్రిల్ 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గేట్‌-2020 వ్యాలిడ్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటం గమనార్హం.