లేడి సూపర్ స్టార్ నయనతార సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. నయనతార ఓ వైపు గ్లామర్ పాత్రలనే చేస్తూనే నటన ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తుంది. ఈ కోవలోనే నయనతార ప్రధాన పాత్రలో ‘అమ్మోరు తల్లి’ చిత్రం వచ్చింది. గ్లామర్ పాత్రల్లో అలరించిన నయనతార ఈ మూవీలో అమ్మోరు నటించడంపై సినిమా ప్రారంభంలో విమర్శలు రాగా వాటన్నింటిని తన నటనతో చెక్ పెట్టింది.
Also Read: ‘క్రాక్’ నుంచి దీపావళి సర్ ప్రైజ్.. ‘భూమ్ బద్దల్’ సాంగ్..!
‘అమ్మోరు తల్లి’ సినిమా దీపావళి కానుకగా డీస్ని+హాట్ స్టార్ యాప్ లో విడుదలైంది. నకిలీ బాబాల ఆటకట్టించే కథంశంతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అటువంటి కథనే దర్శకుడి ఆర్జే బాలాజీ ఎంచుకున్నప్పటికీ పాత సినిమాల ప్రభావం పడకుండా చూసుుకున్నాడు. కొన్ని చోట్ల పాత సినిమాలోని సన్నివేశాలు గుర్తించినా నయనతార తన నటనతో వాటిని సినిమాపై పడకుండా సక్సస్ అయింది.
కథ విషయానికొస్తే ఎంజెల్స్ రామస్వామి(ఆర్జే బాలాజీ) ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ గా పని చేస్తుంటాడు. తన తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ముగ్గురు చెల్లెల్లు.. తల్లి.. తాత పోషణ అతడిపై పడుతుంది. ఇక భాగవతి బాబా(అజయ్ ఘోష్) దేవుడి పేరు చెప్పి 11వేల ఎకరాలను ఆక్రమించుకొంటాడు. ఈ నకిలీ బాబా నిజస్వరూపం బయటపెట్టడానికి రామస్వామి ప్రయత్నాలు చేస్తుంటారు.
Also Read: ‘కొమురంభీం’ ప్రభంజనం. టాలీవుడ్లో సరికొత్త రికార్డు సెట్ చేసిన ఎన్టీఆర్..!
కథలో భాగంగానే ఎంజెల్స్ రామస్వామి ఎదుట ముక్కు పుడక అమ్మవారు(నయనతార) ప్రతక్ష్యమవుతుంది. అమ్మోరుతో కలిసి నకిలీబాబాను ఎంజెల్స్ రామస్వామి ఎలా ఆట కట్టించారనేది సినిమాగా రూపొందింది. అమ్మోరుగా నయనతార తన నటవిశ్వరూపం అభిమానులకు చూపించారు. దర్శకులు ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్ పాత కథనే ఎత్తుకున్నా ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా తీయగలిగారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
సినిమాలో బలమైన సన్నివేశాలు లేకపోవడం మైసస్ గా మారింది. ఆర్జే బాలాజీ టెలివిజన్ రిపోర్టర్‌గా ఆకట్టుకోగా నయనతార సినిమా బరువును మొత్తం తన భుజాన మోసింది. తల్లిపాత్రలో మెరిసిన ఊర్వశి, విలన్‌గా అజయ్ ఘోష్ తమదైన నటనతో ఆకట్టుకోగలిగారు. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆర్కే సెల్వ ఎడిటింగ్ ఆకట్టుకుంది. నిర్మాత ఇషారీ కే గణేష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా పండుగ పూట ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూడొచ్చని టాక్ తెచ్చుకుంది.