కేంద్రంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అసాధ్యమైన అంశాలన్నింటినీ చాలా సులువుగా చేస్తూ పోతున్నారు. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు.. 370రద్దు.. కాశ్మీరును రెండు విభజించడం.. త్రిపుల్ తలాక్ రద్దు.. అయోధ్యలో రామమందిర నిర్మాణం.. లాక్డౌన్.. అన్ లాక్ వంటి ఎన్నో సంచలన నిర్ణయాలకు మోదీ ప్రభుత్వం కేరాఫ్ గా నిలిచింది.
Also Read: కేంద్రం వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత ఎందుకు?”
తాజాగా మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. జాతీయగీతం ‘జనగణమన’లోని అనవసర పదాలను తొలగించి కొత్త జాతీయగీతాన్ని అందించాలంటూ బీజేపీ ముఖ్యనేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి తాజాగా ప్రధానికి లేఖరాయడం హాట్ టాపిక్ గా మారింది.
జాతీయ గీతాన్ని మార్చాలని డిమాండ్ కొత్తదేమీకాదు. గతంలోనూ చాలాసార్లు ఈ డిమాండ్ వచ్చింది. తాజాగా సుబ్రమణ్యస్వామి లేఖతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న జాతీయ గీతంలో కొన్ని అనవసరపు పదాలు ఉన్నాయని తెలిపారు. ఇందులోని కొన్ని పదాలు ఎవరిని ప్రశంసిస్తూ రాశారో తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత జాతీయ గీతానికి బదులుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ 1943 అక్టోబరు 21న ఇంఫాల్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆలపించిన గీతాన్ని అమలు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. కొత్త జాతీయ గీతాన్ని వచ్చే రిపబ్లిక్ దినోత్సవంలోపు రూపొందించాలని తన లేఖలో సుబ్రమణ్యం సూచించారు.
Also Read: కొయ్యూరు నెత్తుటి గాయానికి….20ఏళ్లు
2019లో కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా ‘జనగనమణ’లోని ‘సింధు’ పదం తొలగించి ఈశాన్యం అనే పదం చేర్చాలంటూ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు తీసుకొచ్చారని తెలిపారు. అలాగే ‘జనగనమణ’లోని అనవసరపు పదాలను తొలగించి.. అవసరమైన వాటిని చేరుస్తామంటూ 1949 నవంబరు 26న భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రస్తావించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
‘జనగణమన’ను విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. దీనిని 1911 డిసెంబరు 27న కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి అలపించారు. అయితే ఇందులోని ‘భారత భాగ్య విధాత’ పదాన్ని 1943లో తొలగించి ఇండియన్ నేషనల్ ఆర్మీ ‘షుభ్ సుఖ్ చైన్’అనే పదాన్ని జోడించారు. ఈ కొత్త జాతీయ గీతాన్ని బోస్ రచించగా కెప్టెన్ రామ్‌సింగ్ స్వరపరిచారు. తాాజాాగా మరోసారి కొత్త జాతీయగీతం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్