https://oktelugu.com/

పోలింగ్ శాతం తగ్గడం ఎవరికి లాభం?

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. గ్రేట‌ర్ ఓట‌ర్ తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయి ఉంది. పోలింగ్‌ ఆగిపోయిన ఓల్డ్‌ మలక్‌ పేట డివిజన్‌లో రేపు రీ పోలింగ్ జరగనుంది. ఓవరల్‌ పోలింగ్‌ 45 శాతం నమోదైంది. రాజకీయ పార్టీల ప్రచార సరళి చూస్తే 60 శాతం నుంచి 70 శాతం వరకు పోలింగ్‌ అవుతుందని అంతా భావించారు. కానీ, 45 శాతం దగ్గరే ఆగిపోవడంతో పార్టీల్లో ఎవరికి లాభమనే చర్చ జోరుగా జరుగుతోంది. Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 2, 2020 12:53 pm
    Follow us on

    Lower Polling Percentage
    జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. గ్రేట‌ర్ ఓట‌ర్ తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయి ఉంది. పోలింగ్‌ ఆగిపోయిన ఓల్డ్‌ మలక్‌ పేట డివిజన్‌లో రేపు రీ పోలింగ్ జరగనుంది. ఓవరల్‌ పోలింగ్‌ 45 శాతం నమోదైంది. రాజకీయ పార్టీల ప్రచార సరళి చూస్తే 60 శాతం నుంచి 70 శాతం వరకు పోలింగ్‌ అవుతుందని అంతా భావించారు. కానీ, 45 శాతం దగ్గరే ఆగిపోవడంతో పార్టీల్లో ఎవరికి లాభమనే చర్చ జోరుగా జరుగుతోంది.

    Also Read: గ్రేటర్‌‌ ఓటర్లకేమైంది..?

    బీజేపీ వర్సెస్‌ టీఆర్‌‌ఎస్‌

    గ్రేటర్‌‌ ఎన్నికలు ప్రచారం మొదలు కొని ఓటింగ్‌ వరకు బీజేపీ వర్సెస్‌ టీఆర్‌‌ఎస్‌ అన్నట్లు సాగాయి. నేతలు విమర్శలతో, కార్యకర్తలు బైక్‌ ర్యాలీలతో హోరెత్తించారు. అక్కడక్కడ ఇరుపార్టీల కార్యకర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఎన్నికలకు ముందు ఓటర్లు డబ్బులు పంచుతున్నారంటూ పెద్ద రాద్దాంతమే చేశారు. కొన్ని చోట్ల టీఆర్‌‌ఎస్‌ నేతలను బీజేపీ వాళ్లు పట్టుకుంటే.. ఇంకొన్ని చోట్ల బీజేపీ వాళ్లను టీఆర్‌‌ఎస్‌ వాళ్లు పట్టుకున్నారు. ఇదంతా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది.

    Also Read: హుందాతనం కోల్పోతున్న ఏపీ అసెంబ్లీ.. నేతల తీరే కారణమా?

    అధికార పార్టీకి మేలే!

    సాధారణంగా ప్రభుత్వం వ్యతిరేకత ఉంటే పోలింగ్‌ భారీగా నమోదవుతుంది. ఎన్నికలకు ముందు జనాల్లోనూ అది కనిపించింది. చాలాచోట్ల ఓటు అడిగేందుకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను అడ్డుకున్నారు. వరద సాయం, డబుల్‌ బెడ్రూం ఇండ్లపై ప్రశ్నించారు. దీంతో ఈ సారి ఓటింగ్‌ భారీగా పెడుతుందని, అది బీజేపీకి ప్లస్‌ అవుతుందని భావించారు. కానీ అంచనాలకు భిన్నంగా ఓటింగ్‌ పర్సంటేజీ తగ్గింది. దీంతో అధికార పార్టీ నేతలు తమకే అనుకూలమనే భావనలో ఉన్నారు. బీజేపీ నేతలు సైతం ఓటింగ్ శాతం తగ్గేందుకు సర్కారు కుట్ర చేసిందని ఆరోపించడం ఇందుకు బలం చేకూరుస్తుంది. ఏది ఏమైనా ఇంకో రెండు రోజులు గడిస్తే అంతా తెలిసిపోతుంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్