ఇంతకు గ్రేటర్ ఓటర్లు ఏమైంది..? సోషల్ మీడియా పోస్టులతో దేశానికి ఏదో చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే టెకీలు, యూత్‌కు ఓటేందుకేయలేదు..? జీహెచ్‌ఎంసీ పోలింగ్ పర్సంటేజీ 45 శాతం కూడా దాటకపోవడానికి అసలు రీజన్ ఏంటి..? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశాలు ఇవే..! ఇందుకు గ్రేటర్ ఓటర్ నిర్లక్ష్యంతో పాటు ఎన్నో కారణాలు ఉన్నాయనేది మాత్రం వాస్తవం.
Also Read: గ్రేటర్లో బలబలాలు.. మేయర్ పీఠం దక్కేది ఎవరికీ?
కరోనా భయం..
జిల్లాలతో పోల్చుకుంటే సగానికిపైగా కరోనా కేసులు జీహెచ్‌ఎంసీలోనే నమోదయ్యాయి. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం అయ్యే వరకు చాలామంది ఇండ్లలో నుంచి బయటికే రాలేదు. ఈ ఎఫెక్ట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కోవిడ్ రూల్స్ మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేసినా ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. అంతేకాదు లాక్‌డౌన్ కారణంగా ఇక్కడ ఓటు ఉన్న చాలా మంది ఉపాధి కోల్పోవడంతో సొంతూళ్ల బాట పట్టారు. దాదాపు 10 లక్షల మంది వరకు ఇంటికెళ్లి ఉపాధి కూలీ పనో, వ్యవసాయమో చేసుకుంటున్నారు.రాజకీయ పార్టీలు ఎంతసేపు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప ఈ ఓటర్లపై ఏనాడూ దృష్టి పెట్టలేదు. వాళ్లు కూడా బస్సు చార్జిలు పెట్టుకొని హైదరాబాద్‌కు ఏం వెళ్తాంలే అని లైట్ తీసుకున్నారు.
వరుస సెలవులు
వరుస సెలవులు కూడా పోలింగ్‌పై ప్రభావం చూపించాయి. వరుస సెలవులు రావడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఇలా.. నాలుగు రోజులు హాలిడే కావడంతో కొందరు టూర్లకు కూడా వెళ్లారు. తుంగభద్ర పుష్కరాలతో పాటు కార్తీక పున్నమి కావడంతో సెంటిమెంట్ టెంపుల్స్‌ను దర్శించుకున్నారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రం రాలేదు.
Also Read: గ్రేటర్ ‘ఫెయిల్యూర్’.. ఓటర్లది కాదా.. మరీ ఎవరిదీ?
వీకెండ్ జోష్‌లో టెకీలు..!
టెకీలు, ఇతర ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ పోలింగ్ అంతంత మాత్రమే నమోదైంది. అమీర్‌పేట, జూబ్లిహీల్స్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో మాస్ ఏరియాల కంటే చాలా తక్కువ ఓటింగ్ జరిగింది. సాధారణంగా సోషల్ మీడియాలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ యాక్టివ్‌గా ఉండారు.. అందరూ ఓటు వేయాలంటూ ప్రచారం కూడా చేశారు.. కానీ, విచిత్రంగా వాళ్లే ఓటేయడానికి రాలేదు. వీకెండ్ జోష్‌లో ఉన్నారమే అంటూ సోషల్ మీడియాలో వారిని ఏకి పారేస్తున్నారు.
ఎన్నిక సంఘం నిర్లక్ష్యమూ కారణమే..
ఓటింగ్ పెరగకపోవడానికి ఎన్ని సంఘం నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. సిటీలో ఎక్కడ హోర్టింగ్స్, పబ్లిక్ ఆస్తులపై రాజకీయ పార్టీల ప్రచారాలే కనిపించాయి.. తప్ప ఓటు వేయాలనే పోస్టర్లు పెద్దగా కనిపించలేదు. 2002 లో- 41.22 శాతం, 2009 లో- 42.95 శాతం, 2016 లో- 45.29శాతంతో పోలిస్తే 2020లో 45.71 శాతం కాస్త పెరిగినా.. ఓటు వేయాలని డివిజన్లలో ప్రచారం జరగలేదనేది కాదనలేదని వాస్తవం. ఈ సారి పార్టీల ప్రచార సరళి చూస్తే 70 శాతం వరకు పోలింగ్ నమోదవుతుందని అంతా భావించారు. కానీ 45.71 శాతం వద్దే ఆగిపోవడంతో ప్రతిపక్ష పార్టీలు నారాజ్ అయినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్