https://oktelugu.com/

నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. పోటీకి నై అంటున్న జానారెడ్డి..!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ నిలదొక్కుకునేందుకు వచ్చిన అద్భుతమైన అవకాశం నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా రేసులో ఉన్నట్లే.. లేకపోతే టీఆర్ఎస్.. బీజేపీలే మధ్య అసెంబ్లీ ఎన్నికల పోరు నడుస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. Also Read: జగ్గారెడ్డి సంచలనం.. త్వరలో పాదయాత్ర..! కాంగ్రెస్ కు చావో.. రేవోల మారిన నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ‘పెద్దాయన’ జానారెడ్డి మాత్రం సుముఖత […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 12, 2020 / 07:40 PM IST
    Follow us on

    కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ నిలదొక్కుకునేందుకు వచ్చిన అద్భుతమైన అవకాశం నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా రేసులో ఉన్నట్లే.. లేకపోతే టీఆర్ఎస్.. బీజేపీలే మధ్య అసెంబ్లీ ఎన్నికల పోరు నడుస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

    Also Read: జగ్గారెడ్డి సంచలనం.. త్వరలో పాదయాత్ర..!

    కాంగ్రెస్ కు చావో.. రేవోల మారిన నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ‘పెద్దాయన’ జానారెడ్డి మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. 40ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న జానారెడ్డి కాంగ్రెస్ కు చావో రేవోల మారిన ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై కాంగ్రెస్ లోని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    గత కొద్దిరోజులుగా జానారెడ్డి కాంగ్రెస్ ను వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై జానారెడ్డి స్పందిస్తూ తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం క్యాండిడేట్ అంటూ కుండబద్ధలు కొట్టారు. అయితే సాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం ఆయన వెనుకడుగు వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: పోస్టాఫీస్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఖాతా ఖాళీ..?

    నాగార్జున్ ఉప ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని జానారెడ్డి బరిలో నింపేందుకు యత్నిస్తున్నారు. ఈమేరకు కాంగ్రెస్ అధిష్టానికి కూడా తేల్చిచెప్పినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో గెలిస్తే కేవలం రెండేళ్లు మాత్రమే పదవీ ఉంటుందని.. ఇందుకోసం తన ఎనర్జీని ఇప్పుడే ఎందుకు వెస్టు చేసుకోవాలని జానారెడ్డి భావిస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.

    కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్లు తెలంగాణలో పరిస్థితులు ఉన్న తరుణంలో జానారెడ్డి బరిలో నిలువకుండా ఆయన కుమారుడిని నిలబెట్టడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే జానారెడ్డి తాను ఉప ఎన్నికల్లో పోటీ చేయకున్నప్పటికీ తన కుమారుడిని గెలిపించుకోవడం కూడా ఆయనకు కత్తి మీద సాముగా మారనుంది. మరీ 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి ఈ ఎన్నికలో ఎలాంటి వ్యూహాలు అవలంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్