https://oktelugu.com/

మోడీ ప్రసంగం.. వరాలు లేవు.. కేవలం కరోనా హెచ్చరికే

కరోనా వేళ మోడీ ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇందులో వరాలు కురిపిస్తాడు. పేదలకు పథకాలు, నగదు బదిలీ, పారిశ్రామికవేత్తలకు ఏదైనా ప్యాకేజీలు ప్రకటిస్తారని చాలా మంది ఎదురుచూశారు. కానీ మోడీ సార్ మాత్రం పండుగల వేళ బయటకొచ్చే జనాలకు కేవలం వార్నింగ్ ఇవ్వడానికే బయటకొచ్చాడని అర్థమైంది. వరాల మూటలు విప్పకుండా.. కేవలం జాగ్రత్తల వరకే మోడీ ప్రసంగం పరిమితమైంది. Also Read: ట్రంప్ కు షాక్: హెచ్‌-1 బీ వీసాపై కోర్టుకు ప్రముఖులు పండుగల వేళ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 / 06:50 PM IST
    Follow us on

    కరోనా వేళ మోడీ ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇందులో వరాలు కురిపిస్తాడు. పేదలకు పథకాలు, నగదు బదిలీ, పారిశ్రామికవేత్తలకు ఏదైనా ప్యాకేజీలు ప్రకటిస్తారని చాలా మంది ఎదురుచూశారు. కానీ మోడీ సార్ మాత్రం పండుగల వేళ బయటకొచ్చే జనాలకు కేవలం వార్నింగ్ ఇవ్వడానికే బయటకొచ్చాడని అర్థమైంది. వరాల మూటలు విప్పకుండా.. కేవలం జాగ్రత్తల వరకే మోడీ ప్రసంగం పరిమితమైంది.

    Also Read: ట్రంప్ కు షాక్: హెచ్‌-1 బీ వీసాపై కోర్టుకు ప్రముఖులు

    పండుగల వేళ అందరూ మాస్కులు ధరించాలని.. శానిటైజర్ వాడాలని.. సబ్బుతో చేతులు కడుగాలని మోడీ ప్రజలను కోరారు. దసరా, దీపావళి, ఈద్, క్రిస్మస్ వేళ ప్రజలందరూ జాగ్రత్తలు పాటించి కరోనానుంచి దూరంగా ఉండాలని మోడీ కోరారు.

    కరోనాపై పూర్తిగా విజయం సాధించేవరకు వదిలిపెట్టవద్దని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. దేశంలో 2వేలకు పైగా ల్యాబులు టెస్టులు చేస్తూ ప్రజలను రక్షిస్తున్నాయన్నారు.కరోనా వేళ పండుగల వేళ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. దేశంలో వైద్యులు బాగా పనిచేస్తున్నారని.. 90 లక్షల బెడ్స్ ఆస్పత్రుల్లో ఉన్నాయన్నారు.

    10 లక్షల మందిలో కేవలం కేవలం 83మంది మాత్రమే భారత్ లో మరణించారని మోడీ తెలిపారు. 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికి మాత్రమే కరోనా సోకిందని మోడీ అన్నారు. దేశంలో కరోనా విస్తరణ, మరణాల రేటు తక్కువ అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో అగ్రదేశాల కంటే భారత్ ముందు ఉందని.. బాగా పనిచేస్తోందని మోడీ అన్నారు. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏమాత్రం ఆదమరిచిన ముప్పు తప్పదని మోడీ హెచ్చరించారు.

    Also Read: వరద బాధితులకు టాలీవుడ్ ప్రముఖుల భారీ విరాళం

    ప్రపంచదేశాలతో పోల్చితే దేశంలో దేశంలో కరనా మరణాల రేటు తక్కువని మోడీ అన్నారు. అమెరికా, బ్రెజిల్, బ్రిటన్ ల కంటే దేశంలో మరణాలు తక్కువగా నమోదయ్యాయని.. విస్తరణ వేగం కూడా తక్కువ అన్నారు. కోవిడ్ పై పోరాటం ఇంకా కొనసాగుతోందని మోడీ అన్నారు. కరోనా మనల్ని ఇప్పుడే వదిలి పెట్టదని మోడీ హెచ్చరించారు. పరిస్థితిని ఇలాగే కొనసాగిద్దామని అన్నారు.