
ప్రధాని నరేంద్రమోడీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల వ్యాక్సిన్ తయారీ ఫార్మా పరిశ్రమలను సందర్శించిన మోడీ ఈరోజు అఖిలపక్ష భేటిలో కీలక ప్రకటన చేశారు. మరికొన్ని వారాల్లోనే భారత్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేనున్నట్టు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.
Also Read: కేంద్రంతో పోరు.. పట్టువదలని రైతులు.. చర్చలు ఫలించేనా?
కరోనా వ్యాక్సిన్ కు ధర కూడా నిర్ణయిస్తామని.. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చి దీని ధరను ఫిక్స్ చేస్తామని మోడీ పేర్కొన్నారు. అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎలా పంపిణీ చేయాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. మన దేశంలో పంపిణీ వ్యవస్థ ఇతర దేశాల కంటే మెరుగైన నెట్ వర్క్ ఉందని.. వ్యాక్సినేషన్ చేసిన అనుభవం కూడా భారత్ కు బాగా ఉందని మోడీ వివరించారు.
ముందుగా ఈ వ్యాక్సిన్ ను కరోనా వారియర్స్ కు.. సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ఇస్తామని మోడీ ప్రకటించారు. ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.
Also Read: అసెంబ్లీలో చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన జగన్
వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారని.. అత్యంత చవకైన, అలాగే సురక్షితమైన కరోనా వ్యాక్సిన్ మీద ప్రపంచమంతా దృష్టిపెట్టిందని.. అందరూ భారత్ వైపు ఆశగా చూస్తున్నారని మోడీ చెప్పుకొచ్చారు. మన శాస్త్రవేత్తలు సరే అన్న వెంటనే ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్