https://oktelugu.com/

సామాన్యుడిని పీల్చిపిప్పి చేసే బడ్జెట్ ఇదీ

‘అంతన్నాడు.. ఇంతన్నాడే మోడీ సార్.. ఇప్పుడు మధ్య తరగతి నడ్డి విరిచేశాడే’ అని నిపుణులు, మేధావులు, సామాన్యులు కేంద్రబడ్జెట్ పై కామెంట్లు చేస్తున్నారు. కరోనా కల్లోలం తర్వాత దేశ మధ్యతరగతి కుదేలైంది. ఉద్యోగ, ఉపాధి కోల్పోయి అందరూ రోడ్డునపడ్డారు. చిన్న చిన్న వ్యాపారులు సైతం చితికిపోయారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారంతా కోల్పోయి నరకయాతన పడ్డారు. మధ్యతరగతి బడ్జెట్ లో ఏదైనా కొన్ని కీలక నిర్ణయాలు ఆర్థికమంత్రి నిర్మలమ్మ తీసుకుంటారని దేశ ప్రజలంతా ఆశించారు. కానీ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 1, 2021 / 07:29 PM IST
    Follow us on

    ‘అంతన్నాడు.. ఇంతన్నాడే మోడీ సార్.. ఇప్పుడు మధ్య తరగతి నడ్డి విరిచేశాడే’ అని నిపుణులు, మేధావులు, సామాన్యులు కేంద్రబడ్జెట్ పై కామెంట్లు చేస్తున్నారు. కరోనా కల్లోలం తర్వాత దేశ మధ్యతరగతి కుదేలైంది. ఉద్యోగ, ఉపాధి కోల్పోయి అందరూ రోడ్డునపడ్డారు. చిన్న చిన్న వ్యాపారులు సైతం చితికిపోయారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారంతా కోల్పోయి నరకయాతన పడ్డారు. మధ్యతరగతి బడ్జెట్ లో ఏదైనా కొన్ని కీలక నిర్ణయాలు ఆర్థికమంత్రి నిర్మలమ్మ తీసుకుంటారని దేశ ప్రజలంతా ఆశించారు. కానీ ఇప్పుడు మధ్యతరగతి గట్టి షాకులే ఇచ్చారు మోడీ సార్..

    పెట్రోల్ రేట్లను వంద దాటించేసి.. ఆత్మ నిర్భర్ అంటూ మసిపూసి.. సామాన్యుడి నుంచి డబ్బులు పిండడమే ధ్యేయంగా పన్నుల బాదుడు బాదేశారు. బడ్జెట్ మొత్తం మధ్యతరగతికి వాతపెట్టేలానే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బడ్జెట్ చూస్తే మధ్యతరగతి నుంచి డబ్బులు పిండుకోవడమే ధ్యేయంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    ప్రధానంగా దేశ ప్రజలు, ఉద్యోగులు అందరికీ నిత్యావసరమైన పెట్రోల్, డీజిల్ పై మరింత పన్నులు పెంచి రూ.100కు చేరువ చేశారు. లీటర్ డీజిల్ పై రూ.4 వ్యవసాయ సెస్సు వేశారు. లీటర్ పెట్రోల్ పై రూ.2.05 రూపాయల వ్యవసాయ సస్సెను విధించారు. సామాన్యులకు నిత్యావసరమైన మొబైల్ ధరలు పెంచేశారు. బంగారం, వెండిపై సస్సె వేశారు. ఆటోమొబైల్స్ పై కస్టమ్ డ్యూటీ వేశారు.

    ఇవన్నీ మధ్యతరగి ప్రజలపై పెను భారం మోపేవే. ఆదాయపు పన్ను శ్లాబుల్లోనూ ఎలాంటి మార్పులు మినహాయింపులు ఇవ్వకుండా మధ్యతరగతి నడ్డి విరిచేశారనే చెప్పొచ్చు.

    మధ్యతరగతి ప్రజల సొంతింటి కలపై కూడా బీజేపీ ప్రభుత్వం నీళ్లు చల్లింది. గృహరుణాలు తగ్గించకపోగా.. మరో ఏడాది వరకు పొడిగించారు. మౌళిక వసతులు, వైద్యానికి పెద్దపీట అంటూ మధ్యతరగతికి ప్రత్యక్ష లాభం లేని రంగాలకు కేటాయింపులు జరిపి పన్నుల బాదుడు మాత్రం వీరి నెత్తిన వేసేశారు.

    మొత్తంగా ఈ బడ్జెట్ సామాన్యుల నడ్డివిరిచేలా ఉందంటున్నారు. మధ్యతరగతి ఉద్యోగుల జేబులు ఖాళీ చేసేలా తయారైందంటున్నారు. ఇప్పటికే కరోనా లాక్ డౌన్ తో డబ్బులు పుట్టని నేటి హయాంలో పరోక్షంగా భారం వేసి ప్రజల జేబుల్లోంచి మోడీ సార్ బాగానే డబ్బులు పిండేస్తున్నాడని చెబుతున్నారు.