Homeఅత్యంత ప్రజాదరణవైరల్ అవుతోన్న 'మెగా జంట' రేర్ ఫోటో !

వైరల్ అవుతోన్న ‘మెగా జంట’ రేర్ ఫోటో !

Ram Charan Upasana
‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ మార్చి 27న తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకోవడానికి ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నాడట. అయితే కేవలం తన మెగా ఫ్యామిలీతోనే చరణ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా చేయబోతున్నారు. ఇక ఈ వేడులను చెర్రీ సతీమణి ఉపాసన దగ్గర ఉండి మరీ చూసుకుంటుంది. ఈ క్రమంలో చరణ్ బర్త్ డే వీక్ కాబట్టి, ఉపాసన వారి పాత ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తోంది

Also Read: ఆర్ఆర్ఆర్ రాంచరణ్ ఫస్ట్ లుక్: వీరోచిత ‘రామా’

కాగా తాజాగా ఉపాసన షేర్ చేసిన ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ ఫోటో ఎప్పటిది అంటే.. పెళ్ళికి ముందు తీసుకున్న ఫొటో అట. ఈ సందర్భంగా ఉపాసన మెసేజ్ పోస్ట్ చేస్తూ “సంతోషంగా ఉండేవాళ్ళు తమ జీవితాల్లోకి సంతోషాన్ని మాత్రమే తీసుకొస్తారు అనే మాటని నమ్ముతాను,” అంటూ ఉపాసన తన భర్త చరణ్ గురించి ఓ ప్రత్యకమైన ఎమోషనల్ మెసేజ్ ను కూడా పోస్ట్ చేసింది.

ఇక వైరల్ అవుతున్న ఈ ఫోటో విషయానికి వస్తే.. ఫొటోలో ఉపాసన చరణ్ తో కలిసి బైక్ దగ్గర నిల్చుని ఉంది. ఇద్దరూ ఫోటోకి ఫోజు ఇచ్చిన విధానం కూడా మొత్తానికి మెగా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. అన్నట్టు ఈ ఫోటో చూస్తుంటే ఉపాసన, రామ్ చరణ్ పెళ్ళికి ముందు కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారని అర్ధం అవుతుంది.

Also Read: ఆడవేషాలు వేసి సంపాదించిన స్టార్ !

ఇక డేటింగ్ తర్వాత అనగా 2012లో వీరి పెళ్లి ఘనంగా అంగరంగ వైభంగా జరిగింది. ఇక ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయం గురించి ఇంతవరకూ ఎలాంటి అధికారికంగా ప్రకటన లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular