ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. రెండో దశ పోలింగ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 167 మండలాల్లో పోలింగ్ జరిగింది. వాటిలో 2786 సర్పంచ్ స్థానాలు, 20817 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.
రెండో విడతలో పలు చోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మిగతా చోట్ల ప్రశాంతంగానే ఎన్నికల పోలింగ్ కొనసాగింది.
రెండో దశలో ఏపీ వ్యాప్తంగా దాదాపు 81.67శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఇప్పటికే ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 167 మండలాల పరిధిలోని 3328 గ్రామ పంచాయతీల్లో రెండో దశ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో అన్ని జిల్లాల్లో కలిపి 539 పంచాయతీలు ఏకగ్రీవాలు అయినట్లు ఎస్ఈసీ వెల్లడించారు. ఏకగ్రీవాలు పోగా.. మిగతా 2786 పంచాయతీల్లో పోలింగ్ నేడు జరిగింది.