FILE - In this Jan. 6, 2020, file photo, Chinese President Xi Jinping stands during a welcome ceremony for Kiribati's President Taneti Maamau at the Great Hall of the People in Beijing. Xi will visit neighboring Myanmar amid efforts to strengthen relations with members of the Association of Southeast Asian Nations. (AP Photo/Mark Schiefelbein, File)
FILE
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ను నిజంగానే చైనా ప్రభుత్వం దాచేసి ప్రపంచవ్యాప్తంగా పాకేలా చేసి లక్షల మంది చావుకు కారణమైందని తాజాగా విషయం బయటపడింది. గత ఏడాది డిసెంబర్ నెలాఖరులో కరోనా వైరస్ కేసు చైనాలో బయటపడడంతో ఏడుగురిని పరిశీలించిన చైనా డాక్టర్ లీ వెన్ లీయాంగ్ అది 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వైరస్ గా చైనా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కానీ చైనా ఆయన విద్వేశాలను రెచ్చగొడుతున్నారని జైల్లో వేసింది. చివరకు ఆయన చనిపోవడంతో చైనాలో పెద్ద ఎత్తున చైనా ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తాయి.
జనవరి ప్రారంభంలో కరోనా వైరస్ ప్రబలుతోందని తోటి వైద్యులను హెచ్చరించిన డాక్టర్ లీ.. ఇది ఫ్లూ కాదని.. ఇది వైరస్ అని ప్రపంచ అత్యవసర పరిస్థితి తప్పదంటూ హెచ్చరించారు. దీనికి సీరియస్ అయిన చైనా ప్రభుత్వం లీను అరెస్ట్ చేసి చైనా ప్రభుత్వం జైలుకు పంపింది. తర్వాత అదే నిజమై ప్రపంచాన్ని కరోనా కబళించింది. ఆ డాక్టర్ కూడా కరోనాకే బలి అయ్యాడు.
కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎలాంటి సమాచారం ట్రెండింగ్లో కారాదని.. చైనీయులు హీరోగా పిలుచుకున్న డాక్టర్ లీ వెన్ లియాంగ్ మరణవార్తను సైతం దాచిపెట్టే ప్రయత్నం చైనా చేసిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు బయటపెట్టాయి. ఈ మేరకు ఆధారాలను ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్, ప్రోపబ్లికా సంస్థలు బయటపెట్టాయి.
చైనా దేశంలో జరిగిన వైరస్ వ్యాప్తి.. దాని పరిణామాలపై సోషల్ మీడియాలో ఎటువంటి సమాచారం పంచుకోరాదని వైరస్ బయటపడ్డ తొలినాళ్లలో చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ప్రభుత్వం ఆదేశించిందని.. ఇందుకోసం కొంతమంది నిపుణులు, సంస్థలను నియమించి వారికి భారీ మొత్తాన్ని చెల్లించిన వైనం ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు తాజాగా బయటపెట్టడం ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.చైనా ప్రభుత్వం మొత్తం 1800 మెమోలు, 3200కు పైగా ఉత్తర్వులను వెలువరించి కరోనా వైరస్ బయటపడకుండా జాగ్రత్త పడిందన్న దారుణం విషయాన్ని మీడియా సంస్థలు బయటపెట్టాయి.
చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉన్న వార్తలు, కథనాలు, సమాచారాన్ని భారీ ఎత్తున నియంత్రించాలని.. ప్రత్యేకంగా నియమించిన యంత్రాంగాన్ని చైనా ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో కొన్ని మీడియా సంస్థలు ఉండడం విశేషం.కరోనా వైరస్ ను దాచిపెట్టిన ప్రపంచాన్ని మోసం చేసిన చైనా.. పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైందని తాజాగా బయటపడిన సంచలన విషయాల ద్వారా వెల్లడైంది. చైనా ఉద్దేశపూర్వకంగానే నిజాలను దాచిపెట్టిందని ఓ నివేదిక బయటపెట్టింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Massive fraud china conspiracy exposed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com