పశ్చిమ బెంగాల్లో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అక్కడ రాజకీయాలు హిటెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రధానంగా అధికార టీఎంసీ.. బీజేపీ మధ్య వార్ నడుస్తోంది.
పశ్చిమబెంగాల్లో బీజేపీ పాగా వేయాలని భావిస్తోంది. గత ఎన్నికల సమయంలోనే బీజేపీ ప్రయత్నాలు చేసినా మమత ముందు బీజేపీ వ్యూహాలు పని చేయలేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ తన అస్త్రాలన్నింటిని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.
అయితే బీజేపీ వ్యూహాలకు సీఎం మమత బెనర్జీ ఆదిలోనే చెక్ పెడుతున్నారు. బీజేపీలోని ముఖ్య నేతలను టీఎంసీలో చేర్చుకుంటూ ఆపార్టీకి గట్టి షాకిస్తున్నారు. దీంతో బీజేపీ.. టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
తాజాగా బీజేపీ ఎంపీ సుమిత్రా ఖాన్ సతీమణి సుజాత మండల్ ఖాన్ తృణముల్ ఎంపీ సౌతతారాయ్.. అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో ఆపార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా సుమిత్రా ఖాన్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కోసం తాను చాలా కష్టపడి పని చేసినట్లు తెలిపారు. అయినా తనకు పార్టీలో గౌరవం లేకుండా పోయిందని.. ఒక మహిళగా ఆ పార్టీలో ఉండలేకపోతున్నానని వ్యాఖ్యానించింది.
బెంగాల్లో బీజేపీకి సీఎం అభ్యర్థే లేడని.. అవినీతిపరులకు గాలం వేసి బీజేపీ పార్టీ బలపడేందుకు యత్నిస్తోందని ఆరోపించింది. మమతా బెనర్జీ కోసం పని చేయడం ఒక మహిళగా తనకు గౌరవం ఉందని తెలిపారు.
తన భార్య సుజాత మండల్ టీఎంసీలో చేరడంపై ఎంపీ సుమిత్రా స్పందించారు. తన భార్య తీసుకున్న నిర్ణయానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మండల్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం చేస్తూ ఆమెకు విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే తన భర్త వ్యాఖ్యలపై మండల్ ఎలా రియాక్టవుతుందో వేచిచూడాల్సిందే..!